టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ దూకుడును, వైసీపీ నేతల వేధింపులను కూడా తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నాయకుల సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో జెండాలు మోసిన వారు.. పోలీసు దెబ్బలు తిన్నవారు..చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైన వారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక సహజంగానే వీరి మేలు కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశం వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే “మాకేంటి?” అని క్షేత్రస్థాయిలో కీలక నాయకుల చెవిలో రొద పెడుతున్నారు. ఇది తప్పుకాదు. పార్టీ కోసం పనిచేశారు కాబట్టి.. తమకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే.. లెక్కకు మిక్కిలిగా ఉండడంతోనే చంద్రబాబుకు వీరిని ఏం చేయాలన్న ఆలోచన పెరిగింది. ఈ క్రమంలోనే లేదనుకున్న జన్మభూమి-2 ను తీసుకువస్తున్నారు. తద్వారా మెజారిటీ కార్యకర్తలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు. దీంతో స్థానికంగా వారు కొంత పార్టీ తరఫున గౌరవంగా ప్రజల మధ్యకువెళ్తారు.
రెండో కీలక నిర్ణయం.. ఇప్పటికీ ఆవాసాలు లేని కార్యకర్తలను గుర్తించి.. వారిని టిడ్కో పథకంలో లబ్ధి దారులుగా చేర్చడం, లేదా.. కొత్తగా తీసుకువస్తున్న ఇళ్ల పథకంలో మేలు జరిగేలా చూడడం. ఈ రెండింటలో కార్యకర్తలు ఏది కోరుకుంటే అది ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకునేందుకు కూడా చంద్రబాబు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాల్లో చిక్కుకుంటే రూ.5 లక్షలకు తగ్గకుండా వారికి ఇవ్వనున్నారు.
అదేసమయంలో కార్యకర్తలను కోల్పోయిన కుటుంబాల్లో ఇప్పటికే వెలుగులు నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. అదేవిధంగా కార్యకర్తల కుటుంబాలకు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులను కూడా అందించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. మొత్తంగా చూస్తే.. కార్యకర్తలకు చంద్రబాబు మంచి ప్రియార్టీ ఇస్తున్నారనే చెప్పాలి.
This post was last modified on August 9, 2024 11:56 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…