ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయవచ్చన్న కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన చేపట్టాలని, జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇక, టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.
ఈ సమావేశంలో పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయం అంత పార్టీకి కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు, ఎన్టీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పైరవీలకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యతనిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
This post was last modified on August 8, 2024 6:33 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…