Political News

టీటీడీ చైర్మ‌న్‌.. హై డిమాండ్

కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు దారి తీసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసు కున్న‌ట్టు తెలిసింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత బోర్డు మొత్తం ఖాళీ అయిన విష‌యం తెలిసిందే. దీంతో నూత‌న బోర్డును ఎంపిక చేయాల్సి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో స‌భ్యుల మాట ఎలా ఉన్నా.. చైర్మ‌న్ ప‌ద‌వికి మాత్రం న‌లుగురు కీల‌క వ్య‌క్తులు పోటీలో నిలిచారు. వీరిలో సినీ రంగానికి చెందిన దిగ్గజ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా ఉన్నారు. అయితే.. వీరంద‌రినీ కాద‌ని.. ఓ టీవీ అధినేత కు చంద్ర‌బాబు మొగ్గు చూపార‌ని తెలిసింది. ఆయ‌న పేరును దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలుచెబుతున్నాయి.

ఒక‌టి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో బోర్డును ఎంపిక చేయ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌న నుంచి కూడా స‌మాచారం. వాస్త‌వానికి గ‌తంలో పార్టీ త‌ర‌ఫున చెద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి బోర్డు చైర్మ‌న్‌గా చేశారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ను చైర్మ‌న్ పోస్టుకు ఎంపిక చేశారు.

ఆయ‌న త‌ర్వాత‌.. బోర్డు మొత్తం వైసీపీ ప‌రిధిలోకి వెళ్లిపోయింది. ఇక‌, ఇప్పుడు కూట‌మి ప్ర‌భు త్వం ఏర్ప‌డిన ద‌రిమిలా.. రెండు మాసాల నుంచి బోర్డుపై క‌స‌ర‌త్తు జ‌రుగుతూనే ఉంది. చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో న‌లుగురు పోటీ ప‌డ‌డంతో దీనికి ఎంపిక చేయ‌డం సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్‌గా మారింది.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు, నిర్మాత సీ. అశ్వ‌నీద‌త్ స‌హా ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ వంటి వారుచైర్మ‌న్ పోస్టుకు పోటీ ప‌డ్డారు. వీరితోపాటు పిఠాపురం టికెట్ ను త్యాగం చేసిన వ‌ర్మ కూడా బ‌రిలో ఉన్నార‌ని.. కొన్నాళ్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

వీరికంటే ఎక్కువ‌గా గ‌త కొన్నాళ్ల నుంచి టీవీ5 అధినేత బీఆర్ నాయుడు పేరును కూడా పార్టీ వ‌ర్గాలు ప్ర‌స్తావించాయి. ఎట్ట‌కేల‌కు నాయుడు వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపిన‌ట్టు తాజా స‌మాచారం. ఆయ‌న పేరును ఖ‌రారు చేశార‌ని తెలిసింది. ఇక‌, బోర్డు స‌భ్య‌ల్లో నాలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు పోటీలో ఉన్నారు.

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ, ఏపీ స‌హా ఢిల్లీకి చెందిన వారు కూడా.. బోర్డు స‌భ్యులుగా పోటీ ప‌డుతున్నారు. వీరి సంఖ్య సుమారు 100కుపైగానే ఉంద‌ని తెలిసింది. అయితే.. బోర్డులో 32 మందికి మాత్ర‌మే అవ‌కాశం ఉంది. గ‌తంలో జ‌గ‌న్ 55 మంది స‌భ్యుల‌ను ఎంపిక చేసి.. కోర్టు నుంచి తిట్లు తిన్న ప‌రిస్థితి ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బోర్డు సంఖ్య‌కు అనుగుణంగా 32 మందినే ఎంపిక చేయాల‌ని.. ఎక్స్ అఫిషియో, అఫిషియో స‌భ్యుల‌ను త‌ర్వాత ఎంపిక చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మ‌చారం. ప్ర‌స్తుతం బోర్డు స‌భ్యుల ఎంపిక కూడా పూర్త‌యింద‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.

This post was last modified on August 8, 2024 12:00 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

34 minutes ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

2 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

2 hours ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

2 hours ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

3 hours ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

3 hours ago