Political News

మ‌ళ్లీ కేకే…. కేక‌!

తాజాగా రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దేశ‌వ్యాప్తంగా 12 రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా నోటిపికేష‌న్ ఇచ్చింది. దీనిలో తెలంగాణ‌కు చెందిన కే. కేశ‌వ‌రావు(కేకే) కూడా ఉన్నారు.

అదేవిధంగా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్రాంతీయ‌, జాతీయ పార్టీల నాయ‌కులు కూడా ఉన్నారు. కేకే మిన‌హా మిగిలిన 11 మంది కూడా.. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటుకు పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఆయా సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో కాంగ్రెస్‌, బీజేపీ, బీజేడీ(ఒడిశా) స‌హా ప‌లు పార్టీల నాయ‌కులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో 9 రాష్ట్రాల‌కు చెందిన ఈ 12 స్థానాల‌కు కూడా సెప్టెంబ‌రు 3న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యించింది.

ఇవీ ఖాళీ అయిన సీట్లు

కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్‌, స‌ర్బానంద్ సోనోవాల్‌, జ్యోతిరాదిత్య సిందియాలు.. లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అంత‌కు ముందు వీరు రాజ్య‌స‌భ స‌భ్యులు. తెలంగాణ‌కు చెందిన కేకే.. బీఆర్ ఎస్ నుంచి సొంత గూడు కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు.

ఒడిశాలోని బీజేడీకి చెందిన మ‌మ‌తా మోహంతా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. అదేవిధంగా లోక్‌స‌భ‌కు ఎన్నికైన వారిలో కామాఖ్య ప్ర‌సాద్‌(బీజేపీ, మిశా భార‌తి(ఆర్జేడీ) వివేక్ ఠాకూర్‌(బీజేపీ, దీపేంద‌ర్ సింగ్ హుడా(కాంగ్రెస్‌, ఉద‌య‌న్‌రాజే భోస్లే(బీజేపీ, కేసీ వేణుగోపాల్‌(కాంగ్రెస్‌, బిప్ల‌వ్ కుమార్ దేవ్‌(బీజేపీ) ఉన్నారు.

ఆయా స్థానాల‌కు ఈ నెల 14న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. 21న నామినేష‌న్ల‌ను తీసుకుంటారు. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌రు 3న ప్ర‌త్యేక ఎన్నిక‌లు నిర్వ‌హించి.. అదే రోజు ఫ‌లితాన్ని వెల్ల‌డిస్తారు. ఇక‌, కేకే విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న స్థానాన్ని వేరేవారికి ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ నేప‌థ్యంలో తిరిగి కేకేనే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కానున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బ‌లం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న గెలుపు నల్లేరుపై న‌డకే కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 8, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya
Tags: KK

Recent Posts

లక్కీ భాస్కర్.. సాధించాడహో

ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…

3 hours ago

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…

3 hours ago

లోకేష్ స్పీచ్‌కు లైకులు ప‌డుతున్నాయ్‌.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్ర‌సంగాల‌కు మంచి లైకులు ప‌డు తున్నాయి. ఇది ఏదో…

3 hours ago

పుష్ప-2లో షాడో విలన్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…

4 hours ago

విశ్వక్‌కు అప్పుడు నో చెప్పిన హీరోయినే..

ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…

6 hours ago