కరోనా వైరస్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికప్పుడు చేసిన వ్యాఖ్యలు ఎంతగా చర్చనీయాంశమయ్యాయో తెలిసిందే. ఆ వైరస్ గురించి మొదట్నుంచి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. కరోనా విషయంలో జనాలు బెంబేలెత్తిపోకుండా ఉండటానికి ధైర్యవచనాలు చెప్పడం మంచిదే కానీ.. వైరస్ గురించి మరీ తేలిక చేసి మాట్లాడటంతోనే వచ్చింది సమస్య. వరుసగా ప్రెస్ మీట్లలో జగన్ మీడియాకు దొరికేస్తుండటం.. ఆయన అవగాహన లేమి అంతా బయటపడిపోవడం.. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో ఒక దశ దాటాక లైవ్ ప్రెస్ మీట్లు ఆగిపోయాయి. తర్వాత తన సందేశాన్ని రికార్డ్ చేసి మీడియాకు రిలీజ్ చేయిస్తున్నారు జగన్. అయితే అందులోనూ జగన్ వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి.
కరోనా గురించి తాను చేసిన తేలికపాటి వ్యాఖ్యలు ఎంతగా విమర్శల పాలవుతున్నా.. జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోవట్లేదు. తాజాగా రిలీజ్ చేసిన మరో రికార్డెడ్ వీడియోలోనూ కరోనా గురించి ఆయన లైట్ అన్నట్లే మాట్లాడారు. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది. కరోనా కూడా స్వైన్ ఫ్లూ తరహాలోనిదే. జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుంది. ఇది జ్వరం కంటే ఎక్కువ కాదు అని జగన్ వ్యాఖ్యానించారు. ఐతే ప్రపంచవ్యాప్తంగా 2 నెలల వ్యవధిలో 2 లక్షల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతే.. ఇప్పటికీ అది జస్ట్ జ్వరం లాంటిదే అంటూ తేలిగ్గా మాట్లాడటం.. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది అని కామెంట్ చేయడంతో జగన్‌ను మరోసారి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యల సంగతలా ఉంచితే దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్నది ఆంధ్రప్రదేశే అని.. పది లక్షల మందికి 1396 చొప్పున టెస్టులు చేశామని.. దేశ సగటు కరోనా పాజిటివ్ రేటు 4 శాతం ఉంటే ఏపీలో అది 1.61 శాతం మాత్రమే అని జగన్ అన్నారు.
This post was last modified on April 27, 2020 8:19 pm
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…