ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6 వ తేదీన బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 30న శాసనసభలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పాడు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరో ఇద్దరు, ముగ్గురు కూడా వెనక్కి వెళ్లిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమై అందరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన ఇంటికి వెళ్లి భేటీ అయ్యాడు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని సముదాయించడంతో ఈ రోజు హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి ఈ రోజు బండ్ల వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల వారు పెత్తనం చేయవద్దని, భవిష్యత్తులో వారికి ఇక్కడ పోటీకి అవకాశం ఇవ్వవద్దన్న ప్రధాన డిమాండ్ సీఎం వద్ద ఉంచినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి బండ్ల డిమాండ్లు ఈసారైనా నెరవేరతాయా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బండ్ల ఇలా ఊగిసలాడటంతో నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on August 2, 2024 2:27 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…