తెలంగాణ అసెంబ్లీలో మాటకు మాట ఎలా ఉన్నా.. తాజాగా సెంటిమెంటు.. ఎమోషన్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ మంత్రి సబిత ఏకంగా కన్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్రశ్నించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడడం.. అదుపు తప్పడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం 10 నిమిషాలకు సభ ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సబితను ఓదార్చే ప్రయత్నం చేశారు.
సబితక్క కంటతడి పెట్టుడేంది? అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు చర్చలు లేకుండా ఉంటా యా? అని అనునయించే ప్రయత్నం చేశారు. ఇదేసమయంలో తాను చెప్పాలని అనుకున్న వాటిని చెప్పేశారు. తమ మధ్య గతంలో జరిగిన విషయాలను సబిత చెప్పారని.. కాబట్టి.. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తోందని అన్నారు. నన్ను సబితక్క మోసం చేసింది. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మనింది ఆమెనే. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పింది ఆమెనే. కానీ, ఆమె మాత్రం బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోయింది ఇది మోసం కాదా అని వ్యాఖ్యానించారు.
నన్ను మోసం చేసింది కాబట్టే సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నన్ను పార్టీలోకి పిలుచుడెందుకు.. నువ్వు పోవుడెందుకు? నన్ను మోసం చేయాలనే కదా? కాదా.. ఈ విషయం సబితక్క గుండెలపై చేయి వేసుకుని చెప్పాలి. అని రేవంత్ వ్యాఖ్యానించా రు. ఈ సమయంలోనూ సబిత మౌనంగా ఉన్నారు. ఇక, సీఎం వ్యాఖ్యలు ముగియగానే .. స్పీకర్ ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. కేటీఆర్‌ను గద్దించారు. ఇది సభా సంప్రదాయం కాదన్నారు.
కాగా.. సబిత కన్నీళ్ల వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు మహిళలను ఏడిపించడమే తెలుసునంటూ.. సభకు వెలుపల పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అనుకుంటున్నామని.. కానీ, సభలో కూడా రక్షణ లేదని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా చిన్న కారణానికి సబిత కన్నీరు పెట్టుకోవడం.. సభలో కొంత దుమారం రేపింది.
This post was last modified on August 1, 2024 3:11 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…