తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీని, ఆయా రాష్ట్రాలలో కొన్ని పార్టీలను బలహీనపర్చేందుకు బీజేపీ అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
అయితే అన్ని చోట్లా బీజేపీ 2/3 ఫార్ములా ప్రకారం చేర్చుకుని ఆయా పార్టీల చేరికల మీద అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. మహారాష్ట్ర మినహా ఎక్కడా బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందులు కలగలేదు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తప్పుపడుతూ వస్తుంది. అధికారంలోకి వస్తే పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే విషయంలో కొత్త చట్టం తెస్తామని ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. అనేక వేదికల మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చెప్పాడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలు చేరితేనే ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుంది. ఖచ్చితంగా 26 మంది చేరుతారని రేవంత్ రెడ్డి చేరికల వ్యవహారాన్ని ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేరారు. అందులో ఒకరు వెనక్కి పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం మీద ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 26 మంది చేరికల వ్యవహారాన్ని ముగించాలని, ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదని సీఎం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ చేరికల విషయం గురించి ఢిల్లీ నుండి కాంగ్రెస్ సీనియర్లు అయిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితరులను అడిగితే అసలు ఎవరు చేరుతున్నారో మాకు తెలియదని, ఆ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని చేరికల వ్యవహారం అంతా రేవంత్ మీద నెడుతుండడంతో రేవంత్ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేల అంశ కోర్టు పరిధిలోకి వెళ్లింది. కొత్తగా చేరే వారు కొంత వెనకా ముందు అవుతున్న నేపథ్యంలో 26 మంది ఎప్పుడు చేరతారు ? ఎప్పుడు ఎల్పీ విలీనం అవుతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చేరికల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
This post was last modified on July 31, 2024 11:22 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…