ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ హయాంలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, రివర్స్‌లో ఆయనపైనే విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.
అదేవిధంగా విశాఖలో హోటల్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా.. పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా వలంటీర్లపై విమర్శలు చేశారు. మహిళలు కనిపించకుండా పోవడం వెనుక వలంటీర్లు ఉన్నారని ఆయన ఆరోపిం చారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వలంటీర్లు పవన్‌పై ఫిర్యాదు చేయడంతో అనంతపురం, కాకినాడ, గుంటూరు, విజయనగ రం, కర్నూలు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పవన్ కల్యాణ్‌పై కేసులు నమోదు చేశారు. వీటిలో కొన్నింటిని గుంటూరు స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది.
గతంలో రెండు సార్లు విచారణ చేసి.. పవన్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంతలో సర్కారు మారిపోయింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే.. ప్రభుత్వం మారిపోయిన దరిమిలా.. పవన్ కల్యాణ్పై గతంలో నమోదైన కేసులను సర్కారు వెనక్కి తీసుకుంటోందని.. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ పెండింగులో ఉందని న్యాయవాదులు తెలిపారు.
పవన్ కల్యాణ్‌తో పాటు పలువురిపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాదులు గుంటూరు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించారు. వీటిని పరిశీలించినకోర్టు హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని.. తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో కేసును పవన్ కల్యాణ్‌పై నమోదైన కేసుల విచారణను వాయిదా వేయాలని న్యాయ వాదులు కోరారు. దీనికి న్యాయాధికారి అంగీకరించారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ కేసులను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on July 30, 2024 10:31 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…