రాజకీయాల్లో కౌంటర్లు.. రివర్స్ ఎటాక్‌లు కామనే. కాకపోతే..ఇప్పుడు మాటలే కాదు.. చేతల్లోనూ రివర్స్ ఎటాక్ జరిగింది. అది కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ఒకింత షాకయ్యేలా పాలిటిక్స్ ఉండడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది వెళ్లిపోయారు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇలా ఒకసారి వెళ్లిన వారు వెనక్కి వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. కానీ, తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన.. ఎమ్మెల్యే తిరిగి వెనక్కి వచ్చి.. మళ్లీ కారెక్కారు.ఈ పరిణామం కాంగ్రెస్‌లోనే కాదు.. రాజకీయాల్లోనూ చర్చగా మారింది.
ఆయనే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం దక్కించుకున్న బండ్ల ఈ నెల మొదట్లో పార్టీ మారారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి.. ఆయన పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో అప్పట్లో ఇక, బీఆర్ఎస్ మరింత ఖాళీ అవుతోందనే చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. అనూహ్యంగా తెరవెనుక ఏం జరిగిందో ఏమో.. తాజాగా బండ్ల నేరుగా వచ్చి కేటీఆర్ ను కలిసి.. మళ్లీ బీఆర్ఎస్ కండువా మార్చేశారు.
ఎందుకిలా?
ఒకవైపు బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలని.. బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని.. కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ సమయంలో అనూహ్యంగా బండ్ల వెనక్కి రావడం బీఆర్ఎస్‌లో చేరడం వంటివి ఆశ్చర్యంగానే కాకుండా.. కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వచ్చేలా చేసింది. మంత్రి పదవులపై ఆశలతో వెళ్తున్నారా? లేక.. ఇతర పదవుల కోసం వెళ్తున్నారా? అనేది ఒక చర్చ అయితే.. వారికి ఆశించిన స్కోప్ కాంగ్రెస్‌లో కనిపించడం లేదని అందుకే వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. మున్ముందు బీఆర్ ఎస్ నుంచి వెళ్లే నాయకులకు ప్రస్తుత ఘటన ఒక లెస్సన్‌గా మారుతుందని అంటున్నారు.
This post was last modified on July 30, 2024 5:21 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…