తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ పిలవడం కాంగ్రెస్ పార్టీలో చర్చానీయాంశం అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీనిని తెలంగాణలోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానం చేశారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా, ఐటీఐఆర్, నవోదయ విద్యాలయాలు, విభజన హామీలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రం మీద గంపెడు ఆశలు పెట్టుకున్నది. కానీ ఏ విషయంలోనూ కేంద్రం నుంచి ఊరట లభించలేదు. కేంద్ర బడ్జెట్ ను బీజేపీ నేతలు సమర్ధించుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం దీనికి బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కేంద్రాన్ని నిలదీసి నిధులు వచ్చేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు తెలంగాణ నుండి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్న నమ్మకం లేని నేపథ్యంలో బీజేపీ ఎంపీలను టార్గెట్ చేయడం మూలంగా అయినా బీజేపీ పెద్దలలో చలనం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
This post was last modified on July 29, 2024 11:12 am
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…
కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…
టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ…
పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్…