2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ఊహాగానాలు నడిచాయి. దీనికి చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు ఆమోదం తెలిపారు అన్న వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం అమరావతిలో తనను కలిసిన అరవింద్ కుమార్ గౌడ్ కు చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. గతంలో ఆయన అసిఫ్ నగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రాభవం తగ్గినా ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు.
ఇక పార్టీకి విధేయుడుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి టీటీడీ బోర్డులో సభ్యులుగా అవకాశం కల్పిస్తారని, మాజీ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, గతంలో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసినిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజుల వచ్చినట్లే అని భావించాలి.
This post was last modified on July 29, 2024 11:10 am
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…