వెనిగండ్లా బొచ్చా.. అన్న కొడాలికి షాక్ ఇచ్చిన రాము!!
“వెనిగండ్లా బొచ్చా.. పీకేదేం లేదు. అసలు డిపాజిట్లు వస్తే కదా!” అని ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుడు వెనిగండ్ల రామ్మోహన్ ఉరఫ్ రాముపై అప్పటి ఎమ్మెల్యే , వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. గెలుపు తనదేనని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ప్రజలు సంచలన తీర్పుతో రాముకు జై కొట్టారు. ఆయన గెలిచి 50 రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే సంచలనాలకు శ్రీకారం చుట్టారు.
గుడివాడ నియోజకవర్గాన్ని అమెరికాలోని సిలికాన్ సిటీగా మారుస్తానని చెప్పిన రాము.. ఆదిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. తాజాగా గుడివాడ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిద్దేందుకు కావాల్సిన రోడ్డు మ్యాప్‌పై ప్రతిష్టాత్మక డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులను నియోజకవర్గానికి తీసుకువచ్చారు. వెనిగండ్ల రాము ఆహ్వానం మేరకు వచ్చిన నిపుణుల బృందం గుడివాడ పట్టణంలో కలియ దిరిగారు. గుడివాడను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రతిపాదనులు చేశారు.
గుడివాడ సిటీలోని ఆర్టీసీ బస్టాండ్, పార్క్, మునిసిపల్ కార్యాలయం సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. తీసుకోవలసిన చర్యలను మ్యాప్ వేసి మరీ వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చింతల కాలువ డ్రెన్ పై కవర్స్ స్లాబ్ లను ఏర్పాటు చేసి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం ద్వారా నగరానికి మరింత వన్నె తీసుకురావచ్చని సూచించారు. అంతేకాదు.. తక్కువ ఖర్చుతోనే వ్యర్థాల నిర్వహణకు ప్రతిపాదనలు ఇచ్చారు. రహదారి విస్తరణలతోపాటు.. వ్యాపార సముదాయాలను పెంచుకునే మార్గాలను సూచించారు.
దీంతో గుడివాడ నగరానికి నియోజకవర్గానికి కూడా.. కొత్త రూపం సాకారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపా రు. ఈ పరిణామంపై నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కనీసం తమ నగరానికి ఎవరూ వచ్చేవారు కూడా కారని, కేవలం పేకాట క్లబ్బులు, కేసినో వ్యవహారాలు మాత్రమే సాగేవని.. ఇప్పుడు 50 రోజుల్లోనే ఎమ్మెల్యే స్పందన బాగుందని స్థానికులు చెబుతుండడం గమనార్హం. మరి ఇప్పుడు కొడాలి నాని ఏమంటారో చూడాలి.
This post was last modified on July 25, 2024 4:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…