Political News

తెలంగాణ బడ్జెట్ .. సమగ్ర స్వరూపం

తెలంగాణ శాసనసభలో 2 లక్షల 91 వేల 191 కోట్ల రూపాయల అంచనాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2 లక్షల 20 వేల 945 కోట్లు, మూలధన వ్యయం 33 వేల 487 కోట్లుగా అంచనా వేశారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందని, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామని, 7 నెలల్లో రూ. 39 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశామని భట్టి వివరించారు. వాస్తవానికి దగ్గరగా గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టామని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు.

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.

వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659 కోట్లు
హార్టికల్చర్ : రూ. 737 కోట్లు
పశుసంవర్ధక శాఖ రూ. 19,080కోట్లు
మహాలక్ష్మి ఉచిత రవాణా రూ. 723కోట్లు
గృహజ్యోతి పథకం రూ. 2,418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ : రూ. 3,836 కోట్లు
పంచాయతీ రాజ్ : రూ. 29816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ : రూ. 50కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి : రూ. 10,000కోట్లు
జీహెఎంసీ : రూ. 3000 కోట్లు
హెచ్ ఎండీఏ : రూ.500 కోట్లు
మెట్రో వాటర్ : రూ. 3385 కోట్లు
హైడ్రా సంస్థకు : రూ.200 కోట్లు
ఏయిర్ పోర్టుకు మెట్రో : రూ.100కోట్లు
ఓఆర్ ఆర్ : రూ.200కోట్లు
హైదరాబాద్ మెట్రో : రూ.500కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో : రూ. 500కోట్లు
మూసీ అభివృద్ధి : రూ.1500కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు : రూ.1500కోట్లు
స్ర్తీ ,శాశు సంక్షేమ శాఖ : రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : రూ.17000 కోట్లు
మైనారిటీ సంక్షేమం : రూ.3000 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.9200 కోట్లు
వైద్య ఆరోగ్యం : రూ.11468 కోట్లు
విద్యుత్ శాఖ : రూ.16410 కోట్లు
అడవులు, పర్యావరణం : రూ.1064 కోట్లు
ఐటీ శాఖకు : రూ. 774కోట్లు
నీటి పారుదల శాఖకు : రూ.22301 కోట్లు
విద్యాశాఖకు : రూ. 21292 కోట్లు
హోంశాఖ : రూ. 9564 కోట్లు
ఆర్ అండ్ బి శాఖకు : రూ. 5790 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు రూ. 1525 కోట్లు

This post was last modified on July 25, 2024 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

3 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

5 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

7 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

10 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

12 hours ago