Political News

పెద్దిరెడ్డికి సెగ‌.. హైకోర్టులో అన‌ర్హ‌త పిటిష‌న్‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి.. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అన‌ర్హ‌త వేటు వేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్‌ను భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ (బీసీవై) నాయ‌కుడు బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ దాఖ‌లు చేశారు.

ఇదీ.. ఆరోప‌ణ‌

“పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్నారు. అయితే.. ఆయ‌న ఆయా ఆస్తుల‌ను త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన‌కుండా దాచిపెట్టారు. దీనిపై విచార‌ణ జ‌రిపి.. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలి”.

ఈ పిటిష‌న్‌ను హైకోర్టు..విచార‌ణ‌కు తీసుకుంది. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌కు ఇరు పక్షాల న్యాయవాదులు సహా, పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా హాజ‌ర‌య్యారు. “పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే.. తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి. ఇంప్లీడ్ చేయండి” అని హైకోర్టు ఆదేశించింది.

యాద‌వ్ చెబుతున్న ఆస్తులు ఇవే..

పెద్దిరెడ్డి అఫిడ‌విట్‌లో చూప‌కుండా దాచిన ఆస్తుల వివ‌రాలు ఇవీ..

  • 142 భూముల‌కు సంబంధించి రికార్డులు పెద్దిరెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్నాయి.
  • ఈనాం భూముల‌ను త‌మ వారి పేరుతో రాయించుకున్నారు. వాటిని కూడా దాచి పెట్టారు.
  • హైద‌రాబాద్‌, ఢిల్లీ, ఇత‌ర విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆదాయం వ‌స్తోంది.
  • ద‌క్షిణాఫ్రికాలో గ‌నుల వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా వ‌స్తున్న ఆదాయ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.
  • బెంగ‌ళూరులో విలాస వంత‌మైన భ‌వ‌నం, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను కూడా దాచి పెట్టారు.
  • పెద్దిరెడ్డిపై 12 కేసులు ఉండ‌గా.. నాలుగు మాత్ర‌మే ఉన్నాయ‌ని చూపించారు.

This post was last modified on July 25, 2024 7:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago