Political News

‘ఫైళ్లు’ చెప్ప‌ని నిజాలు.. చంద్ర‌బాబుకు బిగ్ ఛాలెంజ్‌

రాష్ట్రంలో ప్రధానంగా ఫైళ్ళ మాయం, ద‌గ్ఢం అనేది ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కీలకమైన శాఖల‌లో అనేక అవకతవకులు జరిగాయని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. ప‌లు శాఖ‌ల్లో చోటు చేసుకున్న అక్రమాలు, చీపు లిక్కర్‌ను అత్యధిక ధ‌ర‌కు అమ్మి సొమ్ములు చేసుకున్నారన్న విషయం పైన లోతైన దర్యాప్తు చేయాలని భావించారు. కానీ, కూటమీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఈ శాఖకు సంబంధించిన ఫైళ్లు తగలబడ్డాయి. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కి సంబంధించి నారా లోకేష్ కేసుల విషయం తెలిసిందే.

అయితే ఈ కేసులను బలవంతంగా పెట్టించారని, ఉద్దేశ పూర్వకంగా రాజకీయ కారణాలతో చంద్రబాబును జైలుకు పంపించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా నిజానిజాలు తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా వీటికి సంబంధించిన ఫైళ్లు కూడా అమరావతి రాజధానికి సమీపంలోనే తగలబడిపోయాయి. ఇక ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసుల్లోనూ కీల‌క ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం ఈ నెల రోజుల్లోనే జరిగింది. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులపై వచ్చిన ఆరోప‌ణ‌లు, అసైన్డ్ భూముల విషయానికి సంబంధించి న‌మోదైన కేసుల వివ‌రాలు ఆస‌క్తి రేపుతున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో మ‌ద‌న‌ప‌ల్లెలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్ప‌ద చుక్క‌ల భూములు, 22ఏ, అసైన్డ్‌ భూములకు సంబంధించి.. మదనపల్లిలోని ఆర్టీవో ఆఫీస్ లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన‌ అగ్నిప్రమాదంలో ఫైళ్లు తగలబడిపోవడం గ‌మ‌నార్హం. గతంలోని ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ.. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? దీనివెనుక ఎవరున్నారు ? అనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అధికారులు ఉన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

మరి ఇదే నిజమైతే ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వేచి చూసింది? ఇప్పటికే కొంతమంది ట్రాన్స్ఫర్ చేయగా మరి కొంతమంది విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? అనేది చర్చ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌ద‌న ప‌ల్లి వ్య‌వ‌హారాన్ని మాత్ర‌మే సీరియ‌స్‌గా తీసుకున్న చంద్ర‌బాబు.. వీటి వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యం తెల్చాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని టార్గెట్ చేసే వ్యూహం అయితే క‌నిపిస్తోంది. కానీ.. ఫైళ్ల సంగ‌తి తేల్చేందుకు ఒక్క పెద్దిరెడ్డిని మాత్ర‌మే ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండదు. అస‌లు ఎందుకు ఫైళ్లు ధ‌హ‌నం అవుతున్నాయ‌నే విష‌యంపై దృష్టి పెట్టాల్సి ఉంది.

This post was last modified on July 24, 2024 1:54 pm

Share
Show comments

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

4 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

6 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

7 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

8 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

8 hours ago