తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరింత మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలలో ఉండగా పార్టీ మారిన 10 మంది మీద అనర్హత వేటు వేయాలని ఇటు స్పీకర్, అటు కోర్టులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది.
అదే సమయంలో ఈ పది స్థానాలలో ఉఫ ఎన్నికలు ఖాయం అన్న ప్రచారం కూడా మొదలుపెట్టింది. గతంలో ఉన్న కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయమని బీఆర్ఎస్ వాదిస్తున్నది. మరో 16 మందిని ఎలాగైనా చేర్చుకోవడం ఖాయం అని, అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది కాబట్టి తమ పదవులకు ఢోకా ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను నియమించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ కు మనోస్థైర్యం కల్పించేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఒక విడత పర్యటించి సమావేశాలు నిర్వహించారు.
కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో కొలను బాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలు ఇంఛార్జ్ పదవులు ఆశిస్తున్నారు. జగిత్యాలలో పార్టీ సీనియర్ నేత ఓరుగంటి రమణారావు, గద్వాలలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డిలు ఇంఛార్జ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బాన్స్ వాడ, చేవెళ్ల, భద్రాచలం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో పలువురు ఆశావాహులు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. మరి అనర్హత వేటు ఖాయమేనా ? ఉప ఎన్నికలు వస్తాయా ? అన్నది వేచిచూడాలి.
This post was last modified on July 24, 2024 10:30 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…