ఒక్క ఓటమి వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ఐదేళ్ల అధికారంలో వారు వ్యవహరించిన తీరే ప్రస్తుతం వారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఓటమి పాలైనా ప్రజలలో ఒకింత సానుభూతి ఉండేదని అంటున్నారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న సినీనటి, మాజీ మంత్రి రోజా నగరి శాసనసభ స్థానం నుండి 2004లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తరువాత మారిన పరిస్థితులలో టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో గాలి ముద్దుక్రిష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది.
రెండు సార్లు రోజా గెలిచింది చావు తప్పి కన్నులొట్టబోయినట్లే. అయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా వైసీపీ పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు. తన కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలను గాలికి వదిలేసి నియోజకవర్గంలో కుటుంబ పెత్తనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఏకంగా 45004 భారీ తేడాతో ఓటమి చవిచూసింది.
ఓటమి తర్వాత నియోజకవర్గంలో మొకం చూపలేని పరిస్థితికి రోజా వచ్చింది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో కేవలం రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సోదరులు, భర్తల జోక్యం మితిమీరడంతో పార్టీ క్యాడర్ అంతా రోజాకు దూరమయింది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు ఇంటి నుండి అస్సలు బయటకు రావడం లేదు. కుటుంబసభ్యులతో విహారయాత్రలు, గుడులలో పూజలకు మాత్రమే పరిమితమయింది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిచే వారు కూడా కరువయ్యారని అంటున్నారు. ఎంతో కష్టపడి సినిమాల నుండి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగిన రోజా తన ప్రవర్తనతో రాజకీయ భవిష్యత్తు సమాధికి బాటలు వేసుకున్నారని అంటున్నారు.
This post was last modified on July 23, 2024 4:05 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…