తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే కేసీఆర్ పారిపోతున్నారని సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేఫథ్యంలో నేటి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నారన్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా శాసనసభ సమావేశాలలో నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, శాంతిభద్రతలు, మూసీ ప్రక్షాళన, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుతో పాటు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఆరుగ్యారంటీల అమలు మీద నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇక ప్రభుత్వంలో అవినీతిపై ప్రశ్నించేందుకు బీజేపీ సిద్దం అవుతుంది. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి సమావేశాలు జరుగుతుండడంతో అధికార పార్టీగా కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది ఉత్కంఠ నెలకొన్నది.
This post was last modified on July 23, 2024 3:59 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…