రాబోయే నవంబర్ 3వ తేదీన జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లే కీలకమవబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భారతీయ అమెరికన్లపై డెమొక్రటిక్ అభ్యర్ధి గా అధ్యక్షునిగా పోటి చేస్తున్న జో బిడెన్ మాటలు వింటే భారతీయుల ఓట్లకు గాలం వేస్తున్నట్లే అనిపిస్తోంది. జో బిడెన్ మాట్లాడుతూ అమెరికా ఆర్ధికాభివృద్ధికి భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కొంటున్నాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటి ఇపుడు తారాస్ధాయికి చేరుకున్నది. ఒకదశలో పోటి నుండి విరమించుకునేందుకు బిడెన్ ప్రయత్నించాడు. అలాగే తన ప్రత్యర్ధి బిడెన్ కే గెలుపు అవకాశాలున్నాయని స్వయంగా ఆమధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. అంటే ప్రత్యర్ధులిద్దరిలో కూడా తమ గెలుపుపై పూర్తిస్ధాయి నమ్మకం లేదన్న విషయం తేలిపోయింది. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో మొదలైన, జరిగిన రాజకీయ పరిణామాలతో బిడెన్ ఒక్కసారిగా పుంజుకున్నట్లు సర్వేలు చెప్పాయి. ఇదే సమయంలో ట్రంప్ కు కూడా అమెరికన్ల నుండి మద్దతు అనూహ్యంగా పెరిగింది. దాంతో మళ్ళీ ఇద్దరు పోటిలో పుంజుకున్నారు.
ఈ నేపధ్యంలోనే బిడెన్ భారతీయ అమెరికన్ల ఓట్లపై కన్నేసినట్లు అర్ధమవుతోంది. మరి ఎన్నికల్లో గెలుపుకోసం అందుబాటులో ఉన్న మార్గాలను ఎంచుకోవటంలో తప్పులేదు కదా. ఇందులో భాగంగానే బిడెన్ మెల్లిగా అమెరికాలో ఉన్న భారతీయులను దువ్వుతున్నారు. భారతీయ అమెరికన్లు నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బిడెన్ మాట్లాడుతు ప్రపంచవ్యప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు, సిలికాన్ వ్యాలీ ఆవిష్కర్తలు, ప్రపంచంలోని ప్రభావవంతమైన సంస్ధలను నడుపుతున్న వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు చెప్పారు.
భారతీయులు పాటించే సాంస్క్రతిక, సామాజిక, కుటుంబ విలువలను బిడెన్ ఆకాశానికి ఎత్తేశారు. భారతీయులంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పటం గమనార్హం. సరే ఎవరెన్ని మాట్లాడిని అంతిమంగా ఎన్నికల్లో విజయం సాధించటమే ప్రధాన టార్గెట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ పాలనలో అరాచకాలను తాను సరిచేస్తానని బిడెన్ హామీ ఇచ్చారు.
సరే ఎన్నికల్లో అంతిమ విజయం ఎవరిదనే విషయాన్ని పక్కనపెట్టేస్తే అధ్యక్షునిగా ఎవరున్నా వాళ్ళకు రెండోసారి కూడా అవకాశం ఇవ్వటం అమెరికాలో సంప్రదాయంగా వస్తోంది. కాబట్టి అదే సంప్రదాయాన్ని అనుసరించి తనకు రెండోసారి అవకాశం వస్తుందని ట్రంప్ ఆశతో ఉన్నారు. మొత్తానికి అమోరికా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనే విషయంలో సస్పెన్సు మాత్రం పెరిగిపోతోంది.
This post was last modified on September 25, 2020 10:55 am
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…