వచ్చే ఏడు మాసాల కాలానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం(ఏడు మాసాలకు) రూ.48.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా ఉండగా.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనావేశారు. మొత్తంగా చూస్తే.. విదేశీ పెట్టుబడులకు.. వ్యాపారాలకు రెడ్ కార్పెట్ పరిచారు.
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ మంత్రాన్ని జపించారు. ఇతర దేశాల్లో భారత్ పెట్టుబ డుల విధానంలోకూడా సరళీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే.. అటు వారు ఇటు.. ఇటు వారు అటు వెళ్లి వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇది ఉపాధికల్పనపై పెను ప్రభావం చూపించనుం దనేది ఆర్థిక విశ్లేషకుల మాట.
ఎందుకంటే.. చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు చేసుకునేవారు. పరిశ్రమలు స్థాపించేవారు.. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లలేరు. కానీ, విదేశాల నుంచి వచ్చి ఇక్కడకు వ్యాపారం చేస్తే.. ఆ పోటీని వారు ఏమేరకు తట్టుకుంటారు? అనేది ప్రధాన ప్రశ్న. తద్వారా.. దేశీయ మార్కెట్ రంగం దెబ్బతినడంతోపాటు ఉపాధి కల్పన దెబ్బతింటుంది.
వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామ న్నారు. యూఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు.(ఇదే ఏపీలో పెను వివాదానికి దారి తీసిన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ప్రతి భూకమతం భూ ఆధార్ ద్వారా గుర్తింపు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అయితే.. ఇది మన వారికి కాదు.. పొరుగు దేశాల నుంచి వచ్చి చదువుకునే వారు.
అదేసమయంలో ఈసారి బడ్జట్‌లో కేవలం.. ఏపీకి కొంత మెరుగు కనిపించినా.. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. మాత్రం మొండిచేయే కనిపించింది. ఇక, నిత్యావసర వస్తువుల ధరలను కానీ.. చమురు ధరలను కానీ.. ప్రస్తావించక పోవడం గమనార్హం. అదేసమయంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంపు డ్యూటీలను పెంచుకునేందుకు రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా.. రాష్ట్రాల్లో భూముల ధరలు పెరగనున్నాయి.
This post was last modified on July 23, 2024 1:50 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…