ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. తన మిత్ర పక్షాలకు కొంత మేరకు న్యాయం చేశారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే.. మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో ఏపీలోని టీడీపీ, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటెడ్)లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మోడీ సర్కారు వీరి మద్దతు లేకపోతే.. పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో తాజాగా విడుదలచేసిన బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు లేదనకుండా
.. కొంత మేరకు న్యాయం అయితే చేశారు.
నిజానికి ఏపీ విషయాన్ని తీసుకుంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం బడ్జెట్ ప్రతి పాదనలతోనే రెండు సార్లు(మొత్తం 4 సార్లు) ఢిల్లీవెళ్లారు. అమరాతికి ఆయన ఆశించిన 25 వేల కోట్లు తక్షణ అవసరం. అదేవిదంగా పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాఫర్ డ్యాం, గైడ్ బండ్‌ల పునర్ నిర్మాణా నికి 30 వేల కోట్లు, పునరావాసానికి 30 వేల కోట్లు చొప్పున కేటాయించాలని కోరారు. పైకి చెప్పకపోయినా.. ఎంపీల ద్వారా మీడియాకు తెలిసింది. అదేవిధంగా వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 చొప్పున ప్రతి సంవత్సరం ఇచ్చేలా చూడాలన్నారు.
అయితే.. తాజా బడ్జెట్లో అమరావతికి 15000 కోట్లు కేటాయించినా.. పోలవరం విషయంలో నర్మగర్భంగా వ్యవహరించారు. సాయం చేస్తామని చెబుతూనే.. అంకెలు మాత్రం వెల్లడించలేదు. ఇక, వెనుక బడిన జిల్లాల విషయాన్ని కూడా.. ఇలానే చేశారు. ఎంత ఇస్తామనేది చెప్పలేదు. గతంలో 750 కోట్ల మేరకు సాయం చేశారు. అది మినహాయించుకుని ఇప్పుడు సాయం చేసే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.,. కొంత వరకే మోడీ సాయం చేస్తున్నారనేది కనిపిస్తోంది. ఇది కూడా ఒక మేలే. వెంటిలేటర్‌పై నుంచి జనరల్ వార్డుకు వచ్చినట్టే!
ఇక, బీహార్ విషయానికివస్తే.. సీఎం నితీష్ కుమార్ కూడా.. మోడీకి బలమైన మిత్రపక్షంగా ఉన్నారు. ఆయన ఏకంగా 30 వేల కోట్లరూపాయలను సాయం చేయాలని.. అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. హోదా కుదరదని సోమవారమే పార్లమెంటులో తేల్చేసిన.. మోడీ.. తాజా బడ్జెట్‌లో 11 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయిస్తామని చెప్పారు. ఇది కొంత ఊరట ఇచ్చే అంశమే. అలానే.. జాతీయ రహదారుల నిర్మాణానికి మరో 20 వేల కోట్ల రూపాయలను అదనంగా ప్రకటించారు. మొత్తంగా మిత్రులకు అంతో ఇంతో న్యాయం చేశారన్న వాదన అయితే.. వినిపిస్తోంది.
This post was last modified on July 23, 2024 1:48 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…