కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం.. కలలు కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం కొంత మేరకు ఫలించిందనే చెప్పాలి. తాజాగా బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్., ఏపీ అమరావతి ప్రాజెక్టుకు విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెలువరించిన బడ్జెట్‌లో రూ.15000 కోట్ల రూపాలయను కేటాయించారు.
ఈ నిధులను పనుల వారీగా కేటాయించనున్నట్టు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని.. రాజధాని ఏర్పాటుకు… నిర్మాణానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నట్టు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో రూ.15000 కోట్లను కేటాయి స్తున్నట్టు తెలిపారు. అత్యంత వేగంగా రాజధాని నిర్మాణం పూర్తికావాలని కేంద్రం కోరుకుంటోంద ని తెలిపారు. అదేవిధంగా విభజన చట్టంలోని అంశాలను కూడా.. సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
విభజన చట్టంలోని అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. అలానే.. కొప్పర్తిలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. ఫైనాన్స్ అసిస్టెంట్స్ ద్వారా.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి.. పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. అయితే..ఎంత కేటాయిస్తామనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి అమరావతి విషయంలో మాత్రం ఆశాజనకంగా నిర్ణయం రావడం గమనార్హం. గత బడ్జెట్‌లో అమరావతికి రూ.1000 కేటాయించిన విషయం తెలిసిందే.
This post was last modified on July 23, 2024 12:07 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…