వైసీపీ అధినేత జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనకు ఇంకా తత్వం బోధపడలేదని.. ఇంకా తెలిసి రాలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో సభకు వచ్చిన జగన్ పేరు పెట్టి ఓ పోలీసును హెచ్చరించడాన్ని పవన్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై అవసరమైతే.. కేసు నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయిందన్న పవన్ కల్యాణ్.. ఇంతలోనే ఏదో జరిగిపోతోందని ప్రజల్లో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
సభ ముగిసిన తర్వాత.. శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వినుకొండలో జరిగిన హత్య కేవలం గ్రూపు తగాదాగా పేర్కొన్నారు.
రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారితీసిందని.. అయితే.. ఈ విషయం తెలిసి కూడా జగన్ .. దీనికి రాజకీయ రంగులు పులమాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై అప్పుడే కుట్రలకు తెరదీశారని.. దీనిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
‘‘అవాస్తవాలు చెప్తు కుట్రలకు తెరలేపుతున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. ఇది.. జగన్ అహంకారానికి నిదర్శనం కాకపోతే.. ఇంకేంటి? ఈనే ఎల్లకాలం అధికారంలో ఉంటానని భమపడ్డారు. కానీ, ప్రజలు తన్ని తరిమేశారు. అయినా.. ఆయనకు బుద్ధి రాలేదు. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది“ అని పవన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని పవన్ ప్రకటించారు. రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. జనసేన తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. చంద్రబాబు విజన్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని.. అదేసమయంలో వైసీపీ నాయకులను కూడా అడ్డుకోవాలని సూచించారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుదామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
This post was last modified on July 23, 2024 10:39 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…