ఆకలితో ఉన్న క్రికెట్ అభిమానులకు మంచి విందు అందిస్తూ ఐపీఎల్ ఎంతో హుషారుగా సాగిపోతున్న వేళ ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ కామెంట్రీ టీంలో సభ్యుడైన ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్.. హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూశాడు. ఆయన నిన్న రాత్రి ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు కూడా కామెంట్రీ చెప్పాడు. అందులో చాలా హుషారుగా కనిపించాడు. నవ్వుతూ, తుళ్లుతూ కామెంట్రీ చెప్పాడు. కరోనా నేపథ్యంలో కామెంటేటర్లను కూడా టోర్నీకి ఆరంభించని నేపథ్యంలో కామెంట్రీ బాక్స్‌ను ముంబయిలో ఏర్పాటు చేశారు. అది ఇక్కడున్న ఫీలింగ్ రాకుండా కామెంటేటర్లు మేనేజ్ చేస్తున్నారు. ఐతే నిన్న రాత్రి కామెంట్రీ చెప్పి.. ఈ రోజు మ్యాచ్‌కు రెడీ అవుతున్న జోన్స్‌కు మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడట. అలాగే ప్రాణాలూ కోల్పోయాడు.
ముంబయిలో తానుంటున్న హోటల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన జోన్స్.. గురువారం నాటి మ్యాచ్‌కు సంబంధించి తన సహచరులతో కొంతసేపు ముచ్చటించిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడట. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చిన చనిపోయాడు. బహుశా ఆ సమయంలో తనతో పాటు ఎవరూ లేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన జోన్స్ 59 టెస్టులు, 164 వన్డేలు ఆడాడు. అతను 1987లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య టైగా ముగిసిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్ సాధించిన డబుల్ సెంచరీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 1997లో అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న జోన్స్.. అప్పట్నుంచి కామెంట్రీ మీద దృష్టిపెట్టాడు. చాలా త్వరగా ప్రముఖ వ్యాఖ్యాతల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో దూకుడుగా వ్యాఖ్యానం చెప్పే జోన్స్ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడాన్ని క్రికెట్ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on September 24, 2020 7:35 pm
కలసి ఉంటే కలదు సుఖం.. అన్నట్టుగా కూటమిగా ఢిల్లీలో నిలబడి ఉంటే.. ఇండియా కూటమి ఘన విజయం దక్కించుకునేది.. అనేందుకు…
రెండు నెలల కిందట విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.…
పెళ్లిళ్లు జరగడం.. జరగకపోవడం అనేది కామనే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. రద్దవుతున్న పెళ్లిళ్ల వ్యవహారాలు…
ప్రధాని నరేంద్ర మోడీకి ఈ శనివారం అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే… పదేళ్లకు పైబడి ఢిల్లీ సీఎం సీటును చేజిక్కించుకునేందుకు…
ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ఏదీ జరగలేదనే…
భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే…