కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పనిలేదా? ఏంటి? ఇదీ.. ఇప్పుడు పార్టీ నాయకుల మాట. దీనికి కారణం.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన రాజకీయాల్లోకి లాగేశారు. ఆయనపై విమర్శలు కూడా గుప్పించారు. ఆశ్చర్యం కాదు. నిజమే. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చిరు చాలా రోజుల కిందటే చెప్పారు. తనను రాజకీయాల్లోకి పిలవద్దని కూడా చెప్పారు. తన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం కూడా ఆయన రోడ్డెక్కలేదు. ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. కేవలం సెల్ఫీ వీడియోతో సరిపుచ్చారు.
అంటే.. దీనిని బట్టి.. చిరు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టేకదా! అయినప్పటికీ.. జగ్గారెడ్డి పనిగట్టుకుని.. సందర్భమే లేకుండా చిరును రాజకీయంగా ఇరుకున పెట్టేలా కామెంట్లుకుమ్మరించారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి రైతులకు మద్దతివ్వడం లేదని.. ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. కనీసం వారిని పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
“రైతులకు జరుగుతున్న నష్టాలు, వారి కష్టాలపై చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించారు. మరి ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు. ఢిల్లీలో రైతులు తమ సమస్యలపై ధర్నాలు చేస్తుంటే.. చిరంజీవి ఎందుకు మద్దతివ్వడం లేదు. ఎందుకు ప్రశ్నించడం లేదు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి.. రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు. రైతుల సానుభూతిపై సినిమాలు తీసి.. డబ్బులు చేసుకున్నారు. కానీ, ప్రధాని మోడీకి మద్దతు ఇస్తున్నారు. ప్రధాని మోడీకి, పవన్ కు మాత్రమే చిరంజీవి మద్దతు ఇస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే చిరంజీవి ఇలా చేయడాన్ని ఖండిస్తున్నం” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే..జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా ఆయనను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని.. లేనిపోని విమర్శలు చేసి.. పార్టీని ఎందుకు బజారున పడేస్తారని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులకు మద్దతిచ్చే విషయంపై చిరంజీవి వ్యవహారాన్ని పార్టీ అధిస్టానమే.. పట్టించుకోవడం లేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. అలాంటప్పుడు చిరంజీవిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం వృథా! అని కొందరు నాయకులు పేర్కొంటున్నారు.
This post was last modified on July 20, 2024 11:16 am
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…