Political News

కాంగ్రెస్ త‌ప్పును వాడుకునేందుకు లోకేశ్ ప్ర‌య‌త్నం!

అఖండ విజ‌యంతో ఏపీలో కూట‌మి అధికారంలో రావ‌డంతో మంత్రి నారా లోకేశ్ దూకుడుతో సాగుతున్నారు. ప్ర‌భుత్వ విష‌యాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఐటీ ప‌రంగా ఏపీని అభివృద్ధి చేసే చ‌ర్య‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఓ త‌ప్పును వాడుకునేందుకు లోకేశ్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాల విష‌యంలో స్థానిక‌త విష‌యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వెంట‌నే స్పందించిన లోకేశ్ ఐటీ కంపెనీల‌ను ఏపీకి ర‌మ్మంటున్నారు.

క‌ర్ణాట‌క‌లోని ప్రైవేటు సంస్థ‌ల్లో కూడా సీ, డీ గ్రూపు ఉద్యోగాలు వంద శాతం క‌న్న‌డిగుల‌కే ఇవ్వ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రైవేటు సంస్థ‌ల్లోని మేనేజ్‌మెంట్ పోస్టుల్లోనూ 50 శాతం, నాన్ మేనేజిమెంట్ పోస్టుల్లో 75 శాతం క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కే ఇవ్వాల‌ని కేబినెట్ తీర్మానించింది. కానీ దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఈ బిల్లును ఇప్ప‌టికైతే అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. కానీ భ‌విష్య‌త్‌లో ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌నే భ‌యం ప్రైవేటు కంపెనీల‌కు క‌లుగుతోంది.

ఇప్పుడు ఈ అవ‌కాశాన్ని వాడుకునేందుకు లోకేశ్ వేగంగా రియాక్టయ్యారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏపీకి రావాల‌ని ఆహ్వానించారు. విశాఖ‌ప‌ట్నంలోని ఐటీ, ఏఐ, డేటా సెంట‌ర్ క్ల‌స్ట‌ర్ల‌కు రావాల‌ని, మంచి సౌక‌ర్యాలు, నిరంత‌ర విద్యుత్ అందిస్తామ‌ని అన్నారు. అయితే కంపెనీలు బెంగ‌ళూరు నుంచి రీలొకేట్ కావాలంటే ముందుగా హైద‌రాబాద్ వైపు చూస్తాయ‌నే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉంది. దీంతో కంపెనీల‌ను హైద‌రాబాద్‌కు ఆహ్వానిస్తే క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని రేవంత్ స‌ర్కారు ఆ సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చు. అందుకే ఈ మంచి అవ‌కాశాన్ని వాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో లోకేశ్ వెంట‌నే రంగంలోకి దిగారు. కంపెనీల‌ను విశాఖకు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు.

This post was last modified on July 19, 2024 7:17 pm

Share

Recent Posts

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

13 minutes ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

1 hour ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

2 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

2 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

4 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

7 hours ago