Political News

అసెంబ్లీ: పక్కా ప్లాన్ తో టీడీపీ, జ‌గ‌న్ కి ఇబ్బందే !

మ‌రో రెండు రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. చంద్ర‌బాబు 45 రోజుల పాల‌న అనంత‌రం.. జ‌రుగుతున్న స‌మావేశాల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. వైసీపీ పాల‌న‌లో జ‌రిగిన లోపాల‌ను ఏక‌రువు పెట్టేందుకు.. అదేవిధంగా శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసేందుకు కూడా స‌భ ఇప్పుడు కీల‌కంగా మార‌నుంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు కొన్ని శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం, అమ‌రావ‌తి కీల‌క‌మైన శ్వేత ప‌త్రాలు.

ఇక‌, మిగిలిన శ్వేత ప‌త్రాల్లో ఆర్థిక‌, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు చెందిన శ్వేత‌ప‌త్రాల‌ను అసెంబ్లీలోనే ప్ర‌వేశ పెట్టాలని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. వీటిని బ‌ట్టి చూస్తే.. స‌భ‌లో జ‌గ‌న్ టార్గెట్ అవుతున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే.. దీనిని ఎంత వ‌ర‌కు పాజిటివ్‌గా త‌మ‌కు వాడుకుంటార‌నేది చూడాలి. ప‌దే ప‌దే జ‌గ‌న్‌ను టార్గెట్ చేసినా.. ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఉండే అవ‌కాశం అయితే క‌నిపించ‌డం లేదు. సో.. టార్గెట్ ప్రాతిప‌దిక‌న‌.. అసెంబ్లీని వాడుకున్నా.. ప్ర‌జ‌లు మ‌రో కోణంలో రిసీవ్ చేసుకునే ప్ర‌మాదం కూడా ఉంది.

ఇక‌, బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు క‌స‌ర‌త్తు పూర్త‌యింది. వ‌చ్చే ఏడు మాసాల కాలానికి చంద్ర‌బాబు ఓటాన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను పునురుద్ధ‌రించ‌నున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు కొన్ని కీల‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టాల్సి ఉంటుంది. మ‌రి వాటికి నిధుల విష‌యాన్ని ఈ బ‌డ్జెట్లోనే ప్ర‌తిపాదించే అవ‌కాశం ఉంది. ఇదేస‌మయంలో అప్పులు-వ‌డ్డీలు.. వంటివాటిని కూడా ఈ బ‌డ్జెట్లో పేర్కొన‌నున్నారు. అయితే.. వాస్త‌వానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 40 రోజుల్లోనే వేల కోట్ల అప్పులు చేసింది. మ‌రి వీటిని పార‌ద‌ర్శ‌కంగా పేర్కొంటారా? లేదా అనేది చూడాలి.

జ‌న‌సేన తీరేంటి?

బ‌డ్జెట్ స‌మావేశాల్లో జ‌న‌సేన ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఏమేర‌కు చంద్ర‌బాబు స‌ర్కారుకు ద‌న్నుగా నిలుస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌మీక్ష‌లు, స‌మావేశాల‌తోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రిపెట్టారు. ఆయా శాఖ‌ల‌పై ఆయ‌న అధ్య‌య‌నం చేసేందుకు ఈ నెల స‌మ‌యాన్ని వినియోగించుకున్నారు. లోపాలు క‌నిపెట్టారు. అదేస‌మ‌యంలో ఆదాయ మార్గాల‌ను కూడా గుర్తించారు. దీంతో ఆయ‌న బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి ప్ర‌తిపాద‌న‌ల‌తో వ‌చ్చార‌నేది సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే బ‌డ్జెట్ స‌మావేశాల్లో స్ప‌ష్టం కానుంది.

This post was last modified on July 19, 2024 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

33 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

3 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

4 hours ago