తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ‘రాజీనామా’ యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో రైతు రుణమాఫీ రూ.2 లక్షల వరకు చేస్తానని చెప్పి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ చేయలేదని.. గతంలో హరీష్ రావు ప్రస్తావించారు. రైతు రుణ మాఫీ చేసి.. మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అంటూ.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే అటు కాంగ్రెస్ నేతలు కూడా మాటలు పేల్చారు. ఇది సవాళ్లకు దారి తీసింది.
రైతు రుణ మాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తిచేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి(సిద్దిపేట) రాజీనామా చేస్తానని హరీష్ రావే స్వయంగా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రుణ మాఫీపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పాసు బుక్కులు ఉన్న ప్రతి ఒక్కరికీ.. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నట్టు స్వయంగా రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు కూడా ఉండబోవన్నారు. అందరికీ రుణ మాఫీ వర్తిస్తుందని తెలిపారు.
అయితే.. మరోసారి హరీష్‌రావును సీఎం రేవంత్ టార్గెట్ చేస్తూ.. రైతులకు రుణమాఫీ చేస్తున్నామని.. అయినప్పటికీ.. ఎవరో నాయకులను(హరీష్‌రావు) తాము రాజీనామా చేయమని అడగబోమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కూడా చెప్పారు. ఎలానూ వారు ఎలాంటి సవాల్‌కు నిలబడరని.. తప్పించుకుని పారిపోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తొలి విడతలతో రూ.లక్ష లోపు రుణాలు ఉన్న అన్నదాతలకు ఉపశమనం కల్పిస్తూ.. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో హరీష్ రావును ఉద్దేశించి.. రేవంత్ వ్యాఖ్యలు గుప్పించారు. “గాంధీ కుటుంబం బూటకపు మాటలు చెప్పదు” అని వ్యాఖ్యానించారు. అందుకే ఇచ్చిన హామీ మేరకు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రుణ మాఫీ చేసి తీరుతున్నామని చెప్పారు. అయితే.. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై.. హరీష్‌రావు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ తాను మాటపైనే నిలబడి ఉన్నానని చెప్పారు.
రూ.2 లక్షల రుణ మాఫీని ఆగస్టు 15 నాటికి చేస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అయితే.. ఇదేసమయంలో తాజాగా మరో షరతు కూడా తెరమీదికి తెచ్చారు. అదే ఆగస్టు 15 నాటికి ‘ఆరు గ్యారెంటీ’లను అమలు చేయాలని అన్నారు. అప్పుడు తాను ఎన్ని సార్లయినా.. రాజీనామా చేసేందుకు రెడీనేనని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం రుణ మాఫీకి ఇప్పుడు రూ.10 వేల కోట్లు రెడీ చేసుకుంది. మరో 8 వేల కోట్లు అవసరం అవుతారని.. అధికారులు చెప్పారు. దీనిని తీసుకురావడం .. రేవంత్ వల్ల కాదని హరీష్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on July 19, 2024 10:03 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…