Political News

సింప‌తీ అంటే సింప‌తీనే.. ఏపీ అయినా.. అమెరికా అయినా!!

రాజ‌కీయాల్లో సింప‌తీకి ఉన్న స్థానం అంద‌రికీ తెలిసిందే. అది ఏపీ అయినా.. ఇప్పుడు అమెరికా అయినా.. ఒక్క‌టే అని నిరూపణ అయింది. ఏపీలో చంద్ర‌బాబును జైల్లో పెట్టిన త‌ర్వాత‌.. టీడీపీపై సింప‌తీ పెరిగింద‌నే స‌మాచారం తెలిసిందే. త‌ద్వారా ఓట‌ర్లు ఈవీఎంల‌లో బ‌ట‌న్ నొక్కేశారు. ఫ‌లితంగా టీడీపీ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఇంకో మాట‌లో చెప్పాలంటే.. పార్టీ స్థాపించిన త‌ర్వాత‌.. ఎన్న‌డూ రాని రీతిలో సీట్లు కొల్ల‌గొట్టింది. ఏకంగా 135 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇదంతా సింప‌తీనేన‌ని అంద‌రూ ఒప్పుకొన్న మాట‌.

ఇక‌, ఇప్పుడు అమెరికా విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ తాజాగా పెన్సిల్వేనియాలో తాజాగా రెండు రోజుల కింద‌ట అధ్య‌క్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. అయితే.. తృటిలో ఆయ‌న త‌ప్పించుకున్నారు. కుడి చెవికి మాత్రం కొంత గాయ‌మైంది. అయితే.. దీని నుంచి ఆయ‌న వెంట‌నే కోలుకున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించారు. అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయ‌న ప్ర‌సంగాల‌ను వీక్షించేందుకు ప్ర‌త్య‌క్షంగా వ‌చ్చే వారి సంఖ్య ఇప్పుడు డ‌బుల్ అయింది. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో ఆయ‌న ప్ర‌సంగాలు వినేవారి సంఖ్య కూడా డ‌బుల్‌ను మించిపోయింది. ఈ రెండు మాత్ర‌మే కాదు.. మ‌రో చిత్రం కూడా చోటు చేసుకుంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. ట్రంప్‌ను బ‌ల‌ప‌రిచేది లేద‌ని.. భీష్మించుకుని కూర్చుకున్న కొంద‌రు రిప‌బ్లిక‌న్ పార్టీ(ట్రంప్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ) నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న‌ను బ‌ల‌ప‌రిచేందుకు క్యూక‌ట్టారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు 30 శాతం మంది రిప‌బ్లిక‌న్ నాయ‌కులు ట్రంప్‌ను విభేదించారు. కొన్ని కొన్ని చోట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ముందుకు కూడా రాలేదు. ఈ విష‌యంలో రిప‌బ్లిక‌న్ల‌ను ఘ‌ట‌న జ‌రిగిన రోజు కూడా.. ట్రంప్ బ్రతిమాలుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా దాడి ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. అమెరిక‌న్ల‌లో వ‌చ్చిన మార్పుతో రిప‌బ్లిక‌న్‌ల‌లో ట్రంప్‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారు కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు గా నిలిచారు.

మ‌రో ముఖ్యవిష‌యం.. ట్రంప్‌పై జ‌రిగిన తుపాకీ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఆయ‌న‌కు విరాళాల వెల్లువ వ‌ర‌ద‌లా పారింది. ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గ‌త వారం వ‌ర‌కు.. ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వ‌న‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జోబైడెన్‌, ట్రంప్ ఇద్ద‌రికీతాను స‌మాన దూరం పాటిస్తాన‌ని.. ఎవ‌రికీ రూపాయి ఇచ్చేది లేద‌ని వెల్ల‌డించారు. ఈయ‌న వెంటే.. ప‌లువురు ధ‌న‌వంతులు కూడా ముందుకు సాగారు. కానీ, పెన్సిల్వేనియా ఘ‌ట‌న త‌ర్వాత‌.. అనూహ్యంగా మ‌స్క్ మ‌న‌సు మార్చుకున్నారు. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు నెల నెలా 376 కోట్ల రూపాయ‌ల‌ను(అమెరికా క‌రెన్సీలో 49 మిలియ‌న్ డాల‌ర్లు) విరాళంగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ప్ర‌పంచ కుబేరుడే క‌దిలిన‌ త‌ర్వాత మిగిలిన వారు ఊరుకుంటారా? వారు కూడా.. ట్రంప్‌కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో ఇప్పుడు ట్రంప్‌.. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందుగానే.. గెలిచినంత ఆనందంలో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. సో.. సింప‌తీ అంటే సింప‌తీనే.. ఏపీ అయినా.. అమెరికా అయినా అంటే.. ఎవ‌రైనా కాద‌న‌గ‌ల‌రా?!

This post was last modified on July 17, 2024 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

57 minutes ago

రిలీజ్ డేట్స్ తో కొత్త సినిమాల తంటాలు !

ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…

2 hours ago

రాజకీయాన్ని మార్చబోయే ‘గేమ్ ఛేంజర్’ ఆట!

https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…

2 hours ago

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…

3 hours ago

నాగచైతన్యకు అల్లు అరవింద్ హామీ

తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…

3 hours ago