ఎన్నాళ్లో వేచిన ఉదయం కోసం ఇప్పుడు టీడీపీలో ఎదురవుతోందా? ఇప్పటి వరకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా లైన్‌లోకి వస్తారా? అంటే.. తాజాగా చంద్రబాబు వేస్తున్న అడుగులు గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టీడీపీని లైన్‌లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే, అనూహ్యంగా పార్టీ నుంచి జంపింగులు పెరుగుతున్నాయి. గెలిచిన వారు.. ఓడిన వారు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ చంద్రబాబుకు దూరమయ్యేందుకు తమ్ముళ్లు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు.
కొందరు ఇప్పటికే సైకిల్ దిగేశారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో.. పార్టీ బలం కోల్పోయి.. జెండా పట్టుకునే తమ్ముడు కూడా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుకు ఇటవల కాలంలో అనేక మంది సీనియర్లు చెబుతూ వస్తున్నారు. “మాటలు చెబితే.. వినేరోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది నాయకులను సంతృప్తి పరచడమే!” అనే సూచనలు వచ్చాయి. ఈ క్రమంలోనే యువతకు పార్టీలో 33 శాతం ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది.
అదేక్రమంలో ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంటు స్థానాల ఆధారంగా టీడీపీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 175 పార్లమెంటు స్థానాలకు కూడా సీనియర్లు మాజీ మంత్రులను టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షులుగా నియమించాలని బాబు నిర్ణయించారు. దీనివల్ల.. పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇది టీడీపీలో సంచలన నిర్ణయం.
ఇప్పటి వరకు జిల్లాలు, మండలాలు, బూత్ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అనుబంధంగా పార్లమెంటు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ ఏమేరకు బలపడుతుందో చూడాలి. ఏదేమైనా.. ఈ ప్రయోగంతో ఇప్పటి వరకు అసంతృప్తితో రగిలిపోతున్నతమ్ముళ్లకు మాత్రం ఒకింత ఉపశమనం కలిగినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 24, 2020 9:56 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…