కొన్ని ఆరోపణలు వచ్చినపుడు, వివాదాలు తలెత్తినపుడు రాజకీయ నాయకులకు మౌనమే సరైన పరిష్కారం. లేదంటే తూతూ మంత్రంగా ఖండించి వదిలేయడం కూడా మంచి ఆప్షనే. అలా కాదని.. సై అంటే సై అంటూ మీడియా ముందుకెళ్లి సవాళ్లు విసిరితే మొదటికే మోసం వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషననర్‌గా పని చేసి సస్పెండైన శాంతి అనే ఆఫీసర్‌కు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఆమె భర్త అయిన మదన్ మోహన్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. తన తండ్రికి బిడ్డ విజయసాయిరెడ్డి కావచ్చని ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మీద సోషల్ మీడియాలో ఒక రోజంతా పెద్ద రచ్చ జరిగింది. దీనికి సంబంధించి మీడియాలోనూ కొంత రభస జరిగింది.
ఐతే దీని మీద ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయి.. మీడియాలో చర్చోగోష్ఠులు నిర్వహించిన జర్నలిస్టుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరినీ ‘ఒరేయ్’ అంటూ సంబోధించడమే కాక.. మీ తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టులు చేయాలి.. మీ పుట్టుక మీద అనుమానాలున్నాయి అని వ్యాఖ్యానించారు.
ఐతే ఈ వ్యాఖ్యలతో ఆయా జర్నలిస్టులు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చూసుకుందాం అంటూ ఆయా ఛానెళ్లలో సవాళ్లు విసిరి ఇప్పుడు తలెత్తిన గొడవ గురించే కాక మొత్తంగా సాయిరెడ్డి అక్రమాల మీద చర్చలు మొదలుపెట్టారు. దీంతో విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన భూ దందాలతో పాటు అన్ని అక్రమాలకు సంబంధించి ఆధారాలు తెప్పించుకుని.. చర్చా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆల్రెడీ శాంతి భర్త మదన్ మోహన్ సాయిరెడ్డికి సంబంధించి అనేక రహస్యాలను బయటపెడతున్నారు. ఆయన్ని కూడా చర్చలకు పిలుస్తున్నారు మీడియా వాళ్లు. శాంతికి సాయిరెడ్డి నాలుగు కోట్ల విల్లా కొనిచ్చిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అంతేకాక విశాఖ ప్రేమ సమాజం భూముల వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారు. ఇలా మీడియా చర్చల్లో సాయిరెడ్డి అక్రమాలు అనేకం బయటికి వస్తున్నాయి.
జనాల అటెన్షన్ అంతా ఇప్పుడు సాయిరెడ్డి మీదే నిలవడంతో కేవలం శాంతి వ్యవహారమే కాక భూదందాలు, ఇతర అక్రమాల గురించి తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికి సాయిరెడ్డి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్లను రెచ్చగొట్టి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 16, 2024 2:21 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…