వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్రస్తుత టీడీపీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జగన్‌పై హత్యాయత్నం.. నిర్బంధం సహా.. ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. సాధారణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు కావడం.. ఎఫ్ ఐఆర్ లోనూ ఆయన పేరు ఉండడం ఇదే తొలిసారి. ఇది నిజంగానే వైసీపీ ఉలిక్కి పడాల్సిన విషయం. కానీ, ఆ పార్టీలో ఎలాంటి జంకు కనిపించలేదు.
అంతేకాదు..జగన్‌కు ఇవన్నీ ఒక లెక్కా
అని నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు. డక్కాముక్కీలు తిన్న నాయకుడు
అంటూ జగన్‌ను కొందరు నాయకులు ప్రశంసించడం.. కేసులు నమోదు కావడం కూడా.. ఒక గొప్ప ఘన కార్యంగా వారు భావించడం.. గమనార్హం. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఇతర నాయకుల వరకు కూడా జగన్ పై నమోదైన కేసులను లైట్ తీసుకున్నారు. ఇవి కోర్టుల్లో నిలబడే కేసులు కావని.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీటిని నమోదు చేశారని చెప్పుకొచ్చారు.
ఇక, మరో అడుగు ముందుకు వేసి.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే.. రఘురామ ఇలా జగన్‌పై కేసులు పెట్టారని కాకాని వ్యాఖ్యానించారు. “మంత్రివర్గంలో చోటు కోసం కొందరు ప్రయత్నించారు. అది రాలేదు. ఇలా చేస్తే అయినా.. వచ్చే సారి దక్కుతుందని ఆశ ఉండొచ్చు.
చంద్రబాబు ఆనందం కోసం.. ఆయన కళ్లలో సంతోషం కోసమే.. ఇప్పుడు ఇలా కేసులు పెట్టాడు. ఇవన్నీ.. జగన్‌కు కొత్తకాదు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీళ్లను చూసి భయపడతాడా?” అని కాకాని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన పరివారం శునకానందం పొందుతున్నారని.. వారిని అలానే పొందాలని తాను కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
This post was last modified on July 14, 2024 10:12 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…