అగ్రరాజ్యం అమెరికాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన పాల్గొన్న ఎన్నికల బహిరంగ సభలో దుండగుడు అతి సమీపం నుంచి కాల్పలు జరిపాడు. డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ కాల్పుల్లో అదృష్టవశాత్తు ట్రంప్ ప్రాణాలతో బయట పడ్డారు. అయితే.. ట్రంప్ కుడి చెవికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఈ ఏడాది నవంబరు 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పలకు తెగబడ్డాడు. డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు.
భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. అనంతరం.. ట్రంప్‌ను వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే.. ఈ కాల్పుల వెనుక తన ప్రత్యర్థులు ఉన్నారంటూ.. ట్రంప్ వ్యాఖ్యానించారు. వేదికపై నుంచి దిగి.. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి.. నినాదాలు చేశారు.
కాగా, తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల దాడిని అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. అమెరికాలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. దీనివెనుక ఎవరు ఉన్నా.. వదిలి పెట్టబోమని బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కమలా హ్యారిస్ సహా.. పలువురు ముఖ్య నాయకులు కూడా.. ఈ కాల్పులను తీవ్రంగా ఖండించారు.
This post was last modified on July 14, 2024 9:54 am
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…