Political News

జ‌గ‌న్‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!!

రాష్ట్రంలో వైసిపి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం చవిచూసిన విషయం తెలిసిందే. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. దీంతో అసెంబ్లీలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా.. ఎలాంటి బిల్లులు తీసుకువచ్చినా వైసిపి తరఫున మాట్లాడే నాయకుడు, నిలదీసే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. ఒకవేళ నిలదీసినా అధికార పార్టీ మైకు ఇవ్వ‌దు. సలహాలు కూడా పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పాటించారా? అని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది కూడా వాస్తవం. కాబట్టి వైసిపి ఎట్లాంటి ప్రశ్నలు సంధించే అవకాశం లేదు.

అంటే ఒక రకంగా అసెంబ్లీలో వైసిపి మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఏకైక దీపం చీకట్లో చిరు దివ్వెలా శాసనమండలి వైసిపిని కాస్త ఊరిస్తోంది. అంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్న‌యినా.. శాసనమండలిలో వ్యతిరేకించడం లేదా సమర్ధించడం ద్వారా తన సత్తా నిరూపించాలనేది వైసిపి ప్లాన్. ఈ విషయం గ్ర‌హించ‌న జగన్మోహన్ రెడ్డి ఫలితం వెలువడిన నాలుగైదు రోజులకే శాసనమండలి సభ్యులందరికీ పిలిచి తాడేపల్లిలో తలంటారు. శాసన మండల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన బోధించారు.

చంద్ర‌బాబు స‌ర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకిస్తారా? లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రం వ్యతిరేకిస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూటమి ప్రభుత్వానికి శాసన మండలిలోకి వచ్చేసరికి బలం లేకపోవడం గమనార్హం. టిడిపికి 9 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇటీవల మరొకరు కలిశారు అంటే 10 అయింది. జనసేనకి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. స్థానిక సంస్థలు పట్టబద్రుల ఎమ్మెల్సీలను గమనిస్తే వారు నలుగురు ఉన్నారు.

అంటే మొత్తంగా చూస్తే 46 మందితో వైసిపి చాలా బలంగా శాసనమండలిలో ఉండటం గమనార్హం. పైగా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి, జగన్‌కు కూడా వీరవిధేయుడనే విషయం అందరికీ తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషన్ రాజుకు ఏరికోరి జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చారు. ఇక మిగిలిన సభ్యుల్లోనూ చాలామంది వైసిపికి అనుకూలంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల్లా శాసనమండలిలో ఉన్న కనీసం 20 నుంచి పాతికమంది సభ్యులు టిడిపిలోకి వెళ్లిపోతున్నారని.

దీనిపై క్షేత్రస్థాయిలో తెరవెనుక చర్చలు కూడా జరుగుతున్నాయని, దీనికి ఒక కీలక మంత్రికి బాధ్యతలు తీసుకున్నారని పెద్ద ఎత్తున టిడిపి వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకులలోనూ చర్చ‌ నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ ఈ లోగా జరిగిన ఒక చిన్న పరిణామం ఈ వార్తలను నిజమ‌నేలా నమ్మేలా చేస్తోంది. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్న జకియా ఖానూం టిడిపి మంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు టిడిపిలోకి వెళ్లిపోతున్నారని వస్తున్న వార్తలను ఇది బలాన్ని ఇచ్చేలా చేసింది.

జ‌కియాఖానుం.. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. శాసనమండలిలో డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇటీవల ఆమె నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ మంత్రి ఫరూక్ ను కలుసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వరుసగా రెండు రోజులపాటు ఫరూక్‌ను ఆమె ర‌హ‌స్యంగా క‌లుసుకున్నారు. ఆయన ఇంట్లోనే భేటీ అయ్యారు. దీనికి సంబంధించి వైసీపీ అలెర్ట్ అయింది. అయితే, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, పార్టీ వర్గాలకు సైతం అందుబాటులోకి రాకుండా ఉండటం వంటివి ప‌లు అనుమానాలకు దారితీస్తున్నాయి.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా టిడిపికి చేరువైనట్టు తెలుస్తోంది. కొందరు జనసేనకి టచ్ లో ఉన్నారని అంటున్నారు. మరికొందరు టిడిపికి ట‌చ్‌లో ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా 20 నుంచి పాతికమంది ట‌చ్‌లో ఉన్నార‌ని చెబుతున్నప్పటికీ కనీసం 10 మంది ఎమ్మెల్సీల వరకు టిడిపికి టచ్ లోకి వెళ్లిపోయారనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. ఇదే జరిగితే మండలలో కూడా వైసిపి ప్రభావం తగ్గిపోయి కూటమి అధిపత్యం పెరిగే అవకాశం ఉంది. బహుశా అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలను శాసనమండలిలో వైసిపి సభ్యులు ఎలానూ వ్యతిరేకిస్తారు కాబట్టి శాసనమండలిలో ఉన్న బలాన్ని తగ్గించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచించి ఉంటుంది.

ఒకవేళ ఇదే జరిగితే దీన్ని జగన్ అడ్డుకుంటారా? లేక చూస్తూ ఊరుకుంటారా? అనేది చూడాలి. ఒక‌వేళ‌ రేపు వేటు వేయాలని చైర్మ‌న్ మోషన్ రాజుకు ఆయన సూచించినా.. వేటు వేసినా.. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడం ఆ పార్టీలకే మెజారిటీ సభ్యుల బలం ఉండడంతో వేటు వేసినా తిరిగి వారిని ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డికి శాసనమండలి ఇప్పుడు అగ్నిపరీక్ష‌గా మారింది. అసెంబ్లీలో లేని బలం శాసనమండలిలో ఉందని ఆయన మురిసిపోతున్నా.. రాబోయే రోజుల్లో శాసనమండలిలోనూ జగన్మోహన్ రెడ్డి హవాను తగ్గించడం లేదా లేకుండానే చేయాలి అనే ప్రయత్నం దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోంద‌ని చర్చ.

మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది అనేది చూడాలి. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వేటు వేసిన ఎమ్మెల్సీలు తిరిగి కూట‌మి తరఫున ఎన్నిక‌ అవుతారు. వేటు వేయకపోయినా ఆ పార్టీలో కలిసిపోతారు. అంటే ఎట్లా చూసినా జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం ఒక్క‌టే కాపాడుకునేందుకు అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 13, 2024 6:59 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

6 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

7 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

11 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago