వైసీపీ హయాంలో రాజకీయ వేధింపులు అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అధినేతల ను జైల్లో పెట్టిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఇక, భావప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరించిందనే వాదన వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచలన విషయం వెలుగు చూసింది. చీమకు సైతం హాని తలపెట్టని హరేకృష్ణ సేవా సమితిని కూడా వైసీపీ ప్రభుత్వం వేధించిందట. 2014-19 మధ్య అనంతపురం ప్రాంతంలోని పెనుగొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలోని హరేకృష్ణ నిర్వాహకులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బిగ్ టాస్క్ అప్పగించారు.
108 అడుగుల ఏకశిల లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించాలని చంద్రబాబు అప్పట్లో కోరారు. బెంగళూరు నుంచి కేవలం 1 గంటలో ఇక్కడకు చేరుకునే అవకాశం ఉండడంతోపాటు.. అనంతపురంలో ప్రఖ్యాత ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు.. దీనిని కూడా ప్రాశస్త్యంలోకి తీసుకురావాలని భావించారు. అయితే.. తర్వాత వచ్చిన జగన్ సర్కారు ఇస్కాన్ నిర్వాహకులను వేధించి.. వారు ఆలయాన్ని కట్టకుండా అడ్డుపడిందనే విషయం తాజాగా వెలుగు చూసింది.
“2019లో మీరు మా ఇస్కాన్‌కి, ఒక బాధ్యత అప్పగించారు. పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించమన్నారు. ఇప్పుడు మీకు మాటిస్తున్నాం, మీరు అప్పగించిన బాధ్యతని, వచ్చే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఇస్కాన్ తరపున మాట ఇస్తున్నాం” అని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్ వెల్లడించారు.
ఇక, దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. “పెనుగొండలో 108 అడుగుల ఏక రాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే, తరువాత వచ్చిన ప్రభుత్వం, దాన్ని కూడా రద్దు చేసింది. మంచి కార్యక్రమాలని అడ్డుకోవటమే, గత 5 ఏళ్ళలో జరిగింది. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నా” అని చంద్రబాబు వెల్లడించారు. మొత్తానికి ఇస్కాన్‌ను కూడా జగన్ వేధించారనే విషయం వెలుగు చూసింది.
This post was last modified on July 13, 2024 4:52 pm
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…