హైదరాబాద్ తెలంగాణకు గుండెలాంటిది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైదరాబాద్ ఎంతో కీలకమైంది. పొలిటికల్ పరంగానూ హైదరాబాద్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంది.
కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ హైదరాబాద్‌పై పట్టుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏ గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందో అదే చోట గులాలీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకునేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కలిపి 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చేశారు.
ఇప్పుడు మరికొంతమంది గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సనత్‌నగర్ నుంచి గెలిచిన తలసాని గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు.
ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో తలసానిని కూడా రేవంత్ ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. తలసాని లాంటి నాయకుడు వస్తే ఆయనతో పాటు మరో అయిదారుగురు కూడా కాంగ్రెస్‌లో చేరుతారన్నది రేవంత్ ప్లాన్‌గా తెలుస్తోంది.
This post was last modified on July 13, 2024 3:22 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…