ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తొత్తుగా, తోక పార్టీగా, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ అని, బీజేపీకి జగన్ ఊడిగం చేస్తున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఊడిగం చేయడమే కాకుండా…మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో కూడా బీజేపీకి జగన్ మద్దతిచ్చారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటన సహా ఏది చూసుకున్నా మొత్తం బీజేపీతో జగన్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ప్రజలు గొయ్యి తీసి పాతిపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధం లేదు అని షర్మిల అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని గొప్పగా చేయకుండా ఏదో మొక్కుబడిగా చేశారని షర్మిల విమర్శించారు. 5 నిమిషాలు అక్కడ నిలబడే రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రంలా జగన్ నివాళులు అర్పించడాన్ని తప్పుబట్టారు. ‘సిద్ధం’ అంటూ పెద్ద పెద్ద సభలు, హోర్డింగ్ లు పెట్టి సభకు రూ.30 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభ ఎందుకు పెట్టలేకపోయారని జగన్ ను షర్మిల నిలదీశారు.
నా తండ్రి, మా పార్టీ నేత కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆ సభకు ఓ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలోని మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు రాజశేఖర్ రెడ్డి జయంతి కోసం సందేశాలు పంపించారని అన్నారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి అని అన్నారు.
This post was last modified on July 12, 2024 8:58 pm
కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్…
కేరళ సినిమాల ఆల్ టైం కలెక్షన్ల రికార్డులు తీస్తే.. అందులో మోహన్ లాల్ పేరు చాలా చోట్ల కనిపిస్తుంది. అక్కడ…
కెరీర్లో ప్రస్తుత దశలో తాను రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ప్రభాస్ లాంటి హీరోలతో నటించలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు…
పంతాలకు పోవద్దు.. కలిసి మెలిసి పనిచేయండి.. అని సీఎం చంద్రబాబు తరచుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజకవర్గాల…
తొలి సినిమాతో ప్రతిభ చాటిన దర్శకుడికి అవకాశాలకు లోటు ఉండదు. సినిమా ఓ మోస్తరుగా ఆడితే చాలు.. నిర్మాతలు క్యూ…
ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు. మీసం మెలేసి మరీ ప్రతిపక్ష పార్టీలకు సవాళ్లు రువ్విన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీ…