Political News

కేసీఆర్ చేసిన త‌ప్పే బీఆర్ఎస్‌ను ముంచుతోందా?

బీఆర్ఎస్ పార్టీకి క‌ష్ట‌కాలం వ‌చ్చింది. తెలంగాణ‌లో పార్టీ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డింది. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో పార్టీకి షాక్ త‌గిలింది. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్ల‌తో అవ‌మానమే మిగిలింది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి క్యూ క‌ట్టారు. ఈ ప‌రిస్థితిల్లో బీజేపీతో జ‌త‌క‌డితేనే బీఆర్ఎస్ బతికే అవ‌కాశాలున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. కానీ పార్టీ అధినేత చేసిన త‌ప్పు కార‌ణంగా బీఆర్ఎస్‌తో పొత్తుకు బీజేపీ స‌సేమీరా అంటోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అహంకారానికి పోయిన కేసీఆర్ కార‌ణంగా బీఆర్ఎస్ మ‌రింత మునుగుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు ఎదురులేద‌ని కేసీఆర్ అనుకున్నారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ గెల‌వ‌డంతో అధికార గ‌ర్వంతో ఎగిరెగిరి ప‌డ్డారు. అదే అధికారంతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విష‌యంలో బీజేపీ అగ్ర‌నేతల్లో ఒక‌రైన బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ ట‌చ్ చేశారు. ఆయ‌న్ని అరెస్టు చేయించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న కోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ఉన్నారు. బీజేపీలో, ఆర్ఎస్ఎస్‌లో బీఎల్ సంతోష్ కీల‌క‌మైన వ్య‌క్తి. త‌మ ఎమ్మెల్యేల‌ను కొన‌డంలో ఆ వ్య‌క్తిదే ప్రధాన పాత్ర అని కేసీఆర్ మొత్తుకున్నారు. దీంతో బీజేపీకి మండింది.

ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్ ప‌రిస్థితి ఆగ‌మైంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత ఏమో జైల్లో ఉంది. పార్టీ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారింది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్ని ర‌కాలుగా క‌లిసొస్తుంద‌ని కేటీఆర్‌, హ‌రీష్ రావు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టాక్‌. ఢిల్లీ వెళ్లి మ‌రీ ఈ మేర‌కు బీజేపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిసింది. అయితే బీఆర్ఎస్‌తో పొత్తుకు బీఎల్ సంతోష్ నో చెప్పార‌ని స‌మాచారం. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి 8 సీట్లు వ‌చ్చాయి. క‌ష్ట‌ప‌డితే తెలంగాణ‌లో పుంజుకునే అవ‌కాశం బీజేపీకి ఉంది. అందుకే బీఆర్ఎస్ త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని సంతోష్ తేల్చి చెప్పార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు సంతోష్‌ను కాద‌ని ద‌క్షిణాదిలో బీజేపీ హైక‌మాండ్ ఏ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌ని టాక్‌. అందుకే ఆనాడు కేసీఆర్ చేసిన త‌ప్పు ఇప్పుడు బీఆర్ఎస్‌కు శాపంగా మారంద‌ని అంటున్నారు.

This post was last modified on July 12, 2024 2:37 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago