Political News

30 రోజుల్లో చంద్రబాబు 30 టాస్క్ లు

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ విధ్వంసకర పాలన చూసి ప్రజలు బెంబేలెత్తిపోయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వైసీపీని గద్దె దించిన ఏపీ ప్రజలు…ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారు. సీఎంగా చంద్రబాబు గెలిస్తేనే ఏపీ భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ప్రజలు ఆ దిశగా ఓట్లు వేసి తమ నేతను గెలిపించుకున్నారు. అదే రీతిలో తనను నమ్మి ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు చంద్రబాబు కూడా తాను ఇచ్చిన హామీల అమలు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన 30 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన 30 కార్యక్రమాలు హాట్ టాపిక్ గా మారాయి.

  1. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..16,347 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  2. సామాజిక పెన్షన్లను రూ.4000 కి పెంచడం
  3. దివ్యాంగుల పెన్షన్ ను రూ.3000 నుంచి రూ.6000 కు పెంచడం
  4. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించడం
  5. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం
  6. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం, ప్రజల ఉచిత ఇసుక అమలు
  7. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు షురూ
  8. ఏపీలో గంజాయి, డ్రగ్స్ కు కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు
  9. ఎర్ర చందనం అక్రమ రవాణా కట్టడికి చర్యలు
  10. శిధిలావస్థలో ఉన్న అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభం
  11. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం
  12. స్కిల్ సెన్సెస్ అమలు కోసం సన్నాహాలు మొదలు
  13. తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
  14. ఏపీ రాజముద్రతో పొలం పాసు పుస్తకాల పున:ముద్రణ
  15. పట్టిసీమ ప్రారంభించి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేయడం
  16. 48 గంటల్లో అత్యాచారం చేసిన కామాంధుల అరెస్ట్
  17. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేయాలని ఆదేశం
  18. కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం
  19. రాజధానికి తలమానికమైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పచ్చజెండా
  20. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు
  21. రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేలా బీపీసీఎల్ తో చర్చలు
  22. అమరావతిలో ప్రతిష్టాత్మక XLRI విద్యా సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం
  23. ఐదేళ్ల తర్వాత పలాసకు సాగు నీరు అందజేత
  24. 5 సంవత్సరాల అనంతరం పిఠాపురానికి పురుషోత్తపట్నం నీరు
  25. వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు లోకేష్ భరోసా
  26. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ
  27. పదేళ్లుగా తెలంగాణాతో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై చర్చ
  28. విజయవాడ తూర్పు బైపాస్‌ కు కేంద్రం నుంచి ఆమోదం పొందడం
  29. నిత్యావసర ధరల నియంత్రణ, రైతు బజార్లలో తక్కువ రేటుకే బియ్యం, కంది పప్పు
  30. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై ఫలప్రదమైన చర్చలు

This post was last modified on July 12, 2024 2:16 pm

Share
Show comments

Recent Posts

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

4 hours ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

5 hours ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

6 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

8 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

9 hours ago