Political News

జ‌గ‌న్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉర‌ఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్ రిట‌ర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మ‌ధ్య ఎంపీగా ఉన్న త‌న‌ను అక్ర‌మంగా నిర్బంధించి క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశార‌ని.. ఈ క్ర‌మంలో త‌నపై హ‌త్యాయ‌త్నం కూడా చేశార‌ని పేర్కొంటూ ర‌ఘురామ తాజాగా గుంటూరు జిల్లా న‌గ‌రం పాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో త‌న‌ను శారీర‌కంగా హింసించార‌ని.. రెబ్బ‌రు లాఠీల‌తో హింసించార‌ని తెలిపారు.

త‌న సెల్‌ఫోన్ ప‌ర్స‌నల్ లాక్ నెంబ‌రు చెప్పాలంటూ.. సీఐడీ అప్ప‌టి చీఫ్ సునీల్ కుమార్ త‌న‌ను కొట్టార‌ని ఫిర్యాదు చేశారు. ఈ స‌మ‌యంలో త‌న గుండెలపై కూర్చుని ఊపిరి ఆడ‌కుండా చేశార‌ని.. త‌న‌ను చంపే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలిపారు. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఎవ‌రెవ‌రిపై ఫిర్యాదు..?

  • అప్ప‌టి సీఐడీ డీజీ సునీల్ త‌నను చావ‌బాదార‌ని.. త‌న గుండెల‌పై కూర్చుని.. హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ర‌ఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • రామాంజ‌నేయులు: అప్ప‌టి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న త‌న‌ను వెంటాడార‌ని ర‌ఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • జ‌గ‌న్‌: అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వీరిని ప్రోత్స‌హించి.. త‌న‌ను చంపించే ప్ర‌య‌త్నం చేశార‌ని ర‌ఘురామ తెలిపారు.
  • డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి: గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేసిన ప్ర‌భావ‌తి.. త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించి త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చార‌ని.. ఈమెపైనా కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేశారు.
  • విజ‌య్‌పాల్‌: అప్ప‌టి గుంటూరు అద‌న‌పు ఎస్పీగా ఉన్న విజ‌య్‌పాల్ త‌న‌ను వేధించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్, ఐపిఎస్‌లు సునీల్ కుమార్, సీతారామంజనేయులు, విజయ్ పాల్‌, డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిల‌పై కేసు నమోదు చేశారు.

ఏయే సెక్ష‌న్లు..?

120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు న‌మోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్ట‌డం, బెదిరించ‌డం, హ‌త్యాయ‌త్నం, నిర్బంధించ‌డం, ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవ‌డం వంటివి ఉన్నాయి.

అప్ప‌ట్లో ఏం జరిగింది?

2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ వివిధ కార‌ణాల‌తో వైసీపీతో విభేదించిన విష‌యం తెలిసిందే. ఈ సమయంలో ఆయ‌న‌పై విద్వేషపూరిత ప్రసంగాలు, సోష‌ల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయ‌న‌ను క‌స్ట‌డీలో హింసించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌ర‌ప‌డం, హైద‌రాబాద్‌లోని మిలిట‌రీ ఆసుప‌త్రిలో ర‌ఘురామ‌కు ప‌రీక్ష‌లు చేయ‌డం తెలిసిందే.

This post was last modified on July 12, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago