వైరల్ అవుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిగా మరి ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలోనే కాకుండా ఎక్కడ సభ పెట్టిన ఏ నాయకుడు మాట్లాడిన సైకో ముఖ్యమంత్రి సైకో జగన్ అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. ఇది ఎన్నికల సమయంలో మరింతగా పుంజుకుంది. సైకోను తరిమేయాలి, సైకో ముఖ్యమంత్రిని తరిమికొట్టాలి అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఇప్పటికీ పార్టీ అభిమానులు కార్యకర్తల్లో వినిపిస్తూనే ఉంది.
ఇక భారీ విజయంతో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా జగన్ను వదిలిపెట్టడం లేదు. వ్యక్తిగతంగా జగన్ను ఆయన టార్గెట్ చేస్తున్నారు. తాజాగా గడిచిన వారం పది రోజులుగా ‘భూతం’ అంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ స్థాయిలో కొన్నాళ్ల కిందట పర్యటించిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘డెవిల్ ని భూస్థాపితం చేస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా తాజాగా సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ జగన్ ఉద్దేశించి ‘భూతం’ అంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది సిద్ధంగానే ఉన్నారని కానీ వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పిన చంద్రబాబు.. ఎటువంటి అనుమానాలు అవసరం లేదని భూతాన్ని ఇప్పటికే భూస్థాపితం చేశామన్నారు. ఇకముందు కూడా భూతాన్ని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసినవి కావడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు జగన్ అంటే భూతం అనేటటువంటి అతిపెద్ద ముద్ర పడేలా చేస్తుంది.
ఇది వ్యక్తిగతంగా చంద్రబాబుకు టిడిపికి ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూర్చే అవకాశం. ఎందుకంటే ఎన్నికలకు ముందు సైకో ముఖ్యమంత్రి సైకో జగన్ అని ఎలా అయితే ప్రచారం చేశారో అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. చివరకు చదువు లేని వారు కూడా ‘సైకో ముఖ్యమంత్రి’ అనే స్థాయికి ఈ ప్రచారం తీసుకెళ్ళింది. ఇప్పుడు చంద్రబాబు భూతం వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డ్యామేజీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిని జగన్ ఎదుర్కొంటారా లేక చూస్తూ ఊరుకుంటారా? అనేది చూడాలి.
This post was last modified on July 12, 2024 7:22 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…