ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా వైసీపీకి ఇవ్వాలా? వద్దా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాల్సందేనని వైసీపీ అధినేత జగన్ పట్టుబట్టారు. దీనికి సంబంధించి రూల్స్ ప్రస్తావిస్తూ.. ఆయనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ రాశారు. కానీ, ఇప్పటి వరకు దీనికి ప్రత్యుత్తరం స్పీకర్ ఇవ్వలేదు.
మరో 20 రోజుల్లో సభ ప్రారంభం కానుంది. బడ్జెట్ సమావేశాలను కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్ . కానీ, ఇప్పటికే సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్.. వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కేవలం ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే జగన్‌ను చూస్తామన్నారు. ఇది జరిగిన తర్వాతే.. జగన్ స్పీకర్ అయ్యన్నకు లేఖ సంధించారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు.
దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలిసింది. గత రెండు రోజులుగా న్యాయ నిపుణులతోనూ అయ్యన్న చర్చించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్ రాసిన లేఖ, స్పీకర్ విచక్షణాధికారాలు, హక్కులు, రూల్స్, చట్ట నిబంధనలు వంటి అనేక అంశాలపై.. న్యాయ నిపుణుల సలహాలను స్పీకర్ తీసుకున్నారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అనే దానికి రూల్స్ అంటూ ఏమీలేవని.. సభలో సంఖ్యా బలాన్ని బట్టి ఇది ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు తెలిసింది.
దీని ప్రకారం.. వైసీపీకి ఉన్నది 11 మంది సభ్యులే కావడంతో ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చినా.. ఇవ్వక పోయినా.. ఇబ్బంది లేదన్నది న్యాయ నిపుణుల మాట. దీనికి 2014, 2019లో పార్లమెంటులో జరిగిన వ్యవహారాలను వారు ఉటంకించారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే.. మోడీ 10 సంవత్సరాలు పాలించారని.. దీనిపై కోర్టులు సైతం ఎలాంటి తీర్పులు ఇవ్వలేదని పేర్కొన్నట్టు తెలిసింది. అంటే.. వైసీపీ రేపు కోర్టు కువెళ్లినా.. ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సమయంలో వైసీపీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on July 6, 2024 11:08 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…