చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీలలో అధికార పక్షం ఒకవైపు ఉంటుంది. మరోవైపు.. సభలకు ఎంపికైన ప్రతిపక్షం ఉంటుంది. చట్ట సభ దృష్టిలో ఇద్దరికీ ఒకే అధికారం ఉంటుంది. అంటే.. చట్టసభల్లో గౌరవం నుంచి లభించే వెసుబాట్ల వరకు కూడా.. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా.. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం ఒక్కటే. ఈ విషయంలో తేడా లేదు. అయితే.. అధికార పక్షానికి లభించే అవకాశం చట్టాలు చేయడం. వాటిని ఆమోదించుకోవడం వరకు పరిమితం.
కానీ, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రధాన అవకాశం ప్రతిపక్షానిదే. అంతేకాదు.. ప్రజాప్రాతినిధ్య చట్టం లోని పలు అంశాలను పరిశీలిస్తే.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు అదికార పక్షం సమాధానం చెప్పాలి. అంతేకాదు.. అవిశ్వాస తీర్మానం కనుక పెడితే.. (దీనిని అడ్డుకునే అధికారం స్పీకర్‌కు కూడా లేదు) ఖచ్చి తంగా చర్చ చేపట్టి.. ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షం కొన్ని అంశాలను ప్రస్తావిస్తే.. పార్లమెంటరీ రూల్స్ 47, 142 ప్రకారం.. వాటిపైనా చర్చ చేపట్టాలి.
ఇది.. ఇతమిత్థంగా రాజ్యాంగం చెబుతున్న మాట. కానీ.. ఇప్పుడు ఏం జరుగుతోందంటే.. బుల్ డోజ్ చేస్తున్నారు. అంటే.. మాటలు, విమర్శలతోనే సభలను గడిపేస్తున్నారు. ఇదేసమయంలో సంఖ్యా బలంతో కూడా.. సభలకు సంబంధం ఉండదు. అధికార పక్షం-ప్రతిపక్షం.. అనే రెండుకాన్సెప్టులు మాత్రమే సభ చూస్తుంది. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ విజయం దక్కించుకున్నారు. ఆయన ఒక్కరు మాత్రమే ఆ పార్టీ నుంచి విజయం దక్కించుకున్నారు.
ఇదేసమయంలో అనేక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. కానీ, సభ విషయానికి వస్తే.. ఆయన రూల్స్‌ను వినియోగించుకుని.. సభలో ఎక్కువ సేపు మైకు తెచ్చుకున్నారు. ఎక్కువ గంటల పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించారు. మరి ఒక్కరే ఉన్నారు కదా.. అని మైకు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. బలమైన రూల్స్ ఉన్నాయి. వాటిని ఆయన వినియోగించుకుని ప్రశ్నలు లేవనెత్తారు.
ఇలానే ఇప్పుడు సంఖ్యా బలం ఉందా లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రూల్స్‌ను వినియోగించుకుంటే.. వైసీపీ కూడా బలమైన గళం వినిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జగన్ తెలుసుకుంటే.. బలమైన సంఖ్యాబలం లేకుండా.. బలమైన గళంతో తన వాణిని సభలోనే వినిపించే అవకాశం ఉంటుందని రాజ్యాంగం గురించి, సభల గురించి అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 6, 2024 11:02 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…