పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఆలస్యం.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ స్టిక్కర్లు, పోస్టర్లు రెడీ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక పవన్ ఎన్నికల్లో గెలిచాక ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది.
బైకుల మీద, కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ హోం మినిస్టర్ గారి తాలూకా అనే స్టిక్కర్లు అంటించుకుని ర్యాలీలు చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఇంకా నడుస్తోంది. ఐతే ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా రావడం విశేషం. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో సభ సందర్భంగా పవన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ హోం మినిస్టర్ గారి తాలూకా అంటూ జనసైనికులు దూసుకెళ్తున్నారని.. కానీ ఈ ట్యాగ్ వేసుకుని తప్పు చేయొద్దని పవన్ సున్నితంగానే హెచ్చరించారు. ఈ స్టిక్కర్ వేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, వన్ వేలో వెళ్లడం.. ఇంకేదైనా నిబంధనలు అతిక్రమించడం లాంటివి చేయొద్దని పవన్ నవ్వుతూ అన్నారు. తప్పు చేయకూడదని, నిబంధనలు పాటించాలని చెప్పే స్థితిలో మనం ఉండాలని.. ఆదర్శంగా బతకాలని.. అంతే తప్ప మనమే తప్పు చేస్తే జనం ఇంకెలా నిబంధనలు పాటిస్తారని పవన్ అన్నాడు.
తాను ఇటీవలే పిఠాపురంలో మూడు ఎకరాల స్థలం కొన్నానని.. అక్కడికి వచ్చి బైక్ రైడింగ్‌లు, రేసులు చేసుకోవచ్చని.. కావాలంటే అక్కడ మట్టి తోలించి.. రేసులకు అనువుగా మారుస్తానని.. హెల్మెట్లు, గార్డ్స్ ధరించి అక్కడ ఏమైనా చేసుకోవచ్చని.. అంతే తప్ప ఎమ్మెల్యేగారి తాలూకా అని చెప్పి రోడ్డు మీద విన్యాసాలు చేయొద్దని పవన్ సూచించాడు.
This post was last modified on July 4, 2024 2:25 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…