ఏపీ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటి? ఇద్దరూ ఏపీ ప్రజలు ఎంచుకున్నవారే.. ఘన విజయం అందించిన వారే. అయినప్పటికీ.. రాష్ట్రం విషయంలో ఎక్కడో తేడా .. ఇద్దరి ఆలోచనల మధ్య చాలా వ్యత్యాసం.. ఇదే ఇప్పుడు రాజకీయంగానే కాకుండా.. అభివృద్ది పరంగా కూడా చర్చకు వస్తోంది. రాష్ట్రాన్ని ఆదాయవనరుగా మార్చుకోవాలన్నది.. చంద్రబాబు ఆలోచన.
ఇది భేష్ అయిన ఆలోచన. ఎందుకంటే.. బ్యాంకులో కోటిరూపాయలు ఉన్నాయనుకుంటే.. వాటిని తీసి ఖర్చు చేసేస్తూ.. పోతే.. ఏదో ఒక నాటికి జీరో అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. అందుకే.. రూ.కోటిని కూడా.. పది కోట్లు చేసే ఆలోచన చేస్తే.. ఆదిశగా అడుగులు వేస్తే.. అప్పుడు ఆదాయానికి.. ఆర్థిక కష్టాలకు కూడా.. ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ చిన్నపాటి ఆలోచన విషయంలోనే అటు జగన్‌ను.. జనాలకు దూరం చేస్తే.. చంద్రబాబును చేరువ చేసింది.
ఏపీలో ఉన్న వనరులను వినియోగించేసి.. ఉన్న వాటిని వాడేసుకుని దీనిని అభివృద్ధి అని చూపించాలని జగన్ ప్రయత్నించారు. అంటే.. అప్పటికే ఉన్న వనరులను ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అందుకే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చారు. ఆయన దృష్టిలో ఇది మంచిది కావొచ్చు. కానీ, ఇది బెడిసి కొట్టింది. పైన చెప్పుకొన్న కోటి రూపాయల తరహాలోనే ఉంటుంది. అందుకే.. దీనిని ప్రజలు యాక్సప్ట్ చేయలేక పోయారు.
అలాకాకుండా.. కొత్త ప్రాంతాన్ని సృష్టించి.. దానిని డెవలప్ చేయడం ద్వారా.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేది చంద్రబాబు ఆలోచన. అంటే.. ఉన్న కోటి రూపాయలతో పిల్లలను పెట్టించడం అన్నమాట. అదే.. అమరావతి. ఇక్కడ పెట్టుబడులు వచ్చేలా చేసి.. తద్వారా రాష్ట్రం మొత్తానికి పంచాలన్న చిన్న ఆలోచన చంద్రబాబును హీరోను చేసింది. దీనిని అందరూ యాక్సప్ట్ చేశారు కూడా.
అయితే.. మధ్యలో 2019లో తలెత్తిన ఎన్నికల సునామీ ఒక్కటే బ్రేకులు వేసింది. అయితే.. ఇప్పుడు మరో చాన్స్ చంద్రబాబుకు వచ్చింది. కానీ, ఇక్కడ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న చిన్న తేడానే రాష్ట్రానికి శాపంగా మారింది.. రాష్ట్రం వెనుకబడేలా చేసింది. ఏదేమైనా.. ఇప్పుడు ఆశాజీవులకు.. ఒకింత.. ఉపశమనే చెప్పాలి. ఇది చంద్రబాబు అనుభవం తెచ్చిన ప్రయోజనం అయితే.. అది దూకుడు తెచ్చిన తంటా!!
This post was last modified on July 4, 2024 1:59 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…