ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. విభజన హామీల పరిష్కారం కోసం.. ఏపీ, తెలం గాణ ముఖ్యమంత్రులు ఈ నెల 6న భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. భేటీ వరకు కామనే అయినా.. రాజకీయంగా ఈ సమస్యల పరిష్కారం విషయం మాత్రం అంత ఈజీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సమాజంలో గూడుకట్టుకున్న సెంటిమెంటును కాదని.. అక్కడి ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేసే అవకాశం లేదు.
ఏచిన్న పొరపాటు చేసినా.. తెలంగాణ సమాజంలో ఆయన ఏకాకి అవుతారు. ఇప్పటి వరకు సంపాయిం చుకున్న క్రెడిట్ కూడా కోల్పోతారు. అందుకే..గతంలోనే కేసీఆర్-జగన్‌లు.. రెండుసార్లు వారి వారి నివాసా ల్లో భేటీ అయినా.. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. పరిష్కారం చూపించలేక పోయారు. ఇప్పుడు ఇదే సమస్య రేవంత్‌ను కూడా వెంటాడుతోంది. తెలంగాణ అభిప్రాయాల ప్రకారం.. ఆయన నడుచుకోవా ల్సి ఉంటుంది. సాగు, తాగు నీటి విషయంలో వివాదాలను ఏకపక్షంగా పరిష్కరిస్తే.. అది వివాదమే అవుతుంది.
అదేవిధంగా కేసీఆర్ హయాంలో విభజన చట్టంలోని ఆస్తులను ఏపీకి ఇవ్వకుండా.. చూశారు. ఇది రాజకీ య కారణమే అన్న విషయం తెలిసిందే. నిజాయితీగా వ్యవహరించి ఉంటే.. జలాల పరిస్థితి ఎలా ఉన్నా.. ఆస్తుల పంపిణీ, విభజన వంటివి ఎప్పుడో చేసుకుని ఉండాలి. కానీ, దీనికి కూడా రాజకీయాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో నాయకులు ముందుకు అడుగులు వేయలే కపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని దాటుకుని.. రేవంత్ వ్యవహరించే సాహసం చేయబోరు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇప్పటికే అనేక ఆస్తులను వదులుకున్న పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడే.. ఏం చేస్తాం.,. పోనీ! అంటూ.. చాలా వరకు ఆస్తులను వదులుకున్నారు. తర్వాత వచ్చిన.. జగన్.. కూడా ఇదే పద్ధతిని అవలంభించారు. తీరా చూస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నా.. ఇది కేవలం టీ -కాఫీ సమావేశమే అవుతుందన్న చర్చ సాగుతోంది. ఇదేసమయంలో ఈ భేటీలో రేవంత్ సహా చంద్రబాబు తీసుకునే రాజకీయ నిర్ణయాలను ఇరు రాష్ట్రాల మేధావులు కూడా గమనిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నా.. సమస్యలు తీరే పరిస్థితి మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
This post was last modified on July 3, 2024 1:38 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…