1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమి తులయ్యారు.
ఉమేష్ చంద్ర హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన సేవలకు గౌరవంగా ఆయన సతీమణి నాగరాణికి అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.
ఆమె అనేక పదోన్నతులు పొందుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఉమేష్ చంద్ర త్యాగాన్ని గుర్తుపెట్టుకుని చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారని ప్రశంసలు కురిపిస్తున్నారు.
1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఉమేష్ చంద్ర కడప జిల్లా ఎస్పీగా శాంతిభద్రతలు నెలకొల్పి “కడప పులి” అనే పేరు తెచ్చుకున్నాడు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరిపారు. అతని అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. అతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి లు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.
This post was last modified on July 3, 2024 12:56 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…