ఏపీలో వ్యవస్థలు ధ్వంస మయ్యాయని, గాడితప్పాయని.. ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబా బు.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిం దే. ఈ క్రమంలో ఇప్పటికే.. ఐఏఎస్, ఐపీఎస్‌లను మార్పు చేశారు. కీలక పోస్టుల్లో ఉండి.. అవినీతి, అక్ర మాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను పక్కకు పెట్టి.. నిజాయితీగా వ్యవహరించే వారికి అవకా శం కల్పించారు. అదేవిధంగా ఉద్యోగుల విషయంలోనూ.. పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఒక రకంగా.. వ్యవస్థను చక్కదిద్దుతానన్న చంద్రబాబు.. ఆదిశగా బలమైన అడుగులు వేశారు. ఇక, ఇప్పు డు ప్రక్షాళన దాదాపు పూర్తయింది. ఇంటెలిజెన్స్ నుంచి ఏసీబీ వరకు.. సీఐడీ నుంచి సాధారణ పోలీసు వరకు కూడా.. చంద్రబాబు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టారు. గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తు న్నారు. దీనిలో భాగంగా.. ఇసుకను పేదలకు ఉచితంగా ఇచ్చే పాలసీపై అధ్యయనం చేయాలని.. అధికా రులను పురమాయించారు.
వర్షాకాలం ముగిసే నాటికి ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అందు బాటులోకి రావడం ద్వారా.. భవన నిర్మాణ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసరాల ధరల తగ్గింపుపైనా..చంద్రబాబు దృష్టి పెట్టారు. కూరగాయలు, నూనె, పంచదార, బియ్యం ధరలను బహిరంగ మార్కెట్‌లో కట్టడి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అదికారులను ఆదేశించారు.
ఇది నాణేనికి ఒక వైపు అయితే.. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కూడా.. చంద్రబా బు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వా రా.. అందించే సౌలభ్యాలను ఆయన విదేశీ పత్రికల్లో ప్రకటనల ద్వారా.. వివరించాలని నిర్ణయించారు. తద్వారా.. రాష్ట్రానికి పెట్టుబడులు సాదించేందుకు అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పైగా సుదీర్ఘ తీర ప్రాంతం కూడా కలిసి రానుంది. ఇలా.. అటు ప్రజలు-ఇటు పెట్టుబడులు-మరోవైపు పాలన దిశగా చంద్రబాబు అడుగులు ప్రారంభించారు.
This post was last modified on July 3, 2024 1:25 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…