Political News

ఇరికించబోయి ఇరుక్కున్న వైసీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ ప్రచారాలే ఉపయోగపడ్డాయని అంటారు. సోషల్ మీడియాలో వేలమందిని రిక్రూట్ చేసుకుని పేటీఎం ద్వారా పేమెంట్స్ ఇవ్వడం ద్వారా అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించి.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని బద్నాం చేయడంలో ఆ పార్టీ విజయవంతమైంది.

ఐతే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందంటారు. ముందు జనాలను నమ్మించినా.. ఆ తర్వాత అసలు విషయం తెలిశాక బూమరాంగ్ అవ్వడం ఖాయం. తెలుగుదేశం హయాంలో ప్రమోషన్లు వచ్చిన డీఎస్సీలందరూ కమ్మలే అని.. వివేకానందరెడ్డి హత్య చంద్రబాబే చేయించారని.. కోడి కత్తితో జగన్ మీద దాడి చేయించింది టీడీపీనే అని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేయించింది వైసీపీ. కానీ తర్వాత ఈ వ్యవహారాల్లో నిజానిజాలు బయటికి వచ్చి వైసీపీ మెడకే చుట్టుకున్నాయి.

పాత వ్యవహారాలు మెడకు చుట్టకుని ఇబ్బంది పడడమే కాదు.. ఈసారి ఎన్నికల ముందు చేసిన ఫేక్ ప్రచారాలు ఏవీ పని చేయలేదు. ఐతే అధికారం కోల్పోయాక కూడా ఆ పార్టీ తీరేమీ మారలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన ప్రజా వేదిక కోసం రూ.900 కోట్లు పెట్టారని సాక్షి మీడియాలో ప్రచారం చేయడం వారికే చెల్లింది. వైసీపీ అధికార హ్యాండిల్లో కూడా ఇప్పటికీ ఫేక్ పోస్టులు పడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక పోస్టే ఆ పార్టీ మెడకు చుట్టుకుంది.

చంద్రబాబు ప్రభుత్వం హయాంలోకి వచ్చాక ‘999 పవర్ స్టార్’ పేరుతో ఒక మద్యం బ్రాండు అందుబాటులోకి వచ్చిందని.. నాణ్యమైన మద్యం తెస్తామని హామీ ఇచ్చి ఇదా మీరు చేసేది అంటూ వైసీపీ అధికారిక హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది చూసి జనం కొంత ఆశ్చర్యపోయారు. కానీ కాసేపటికే అసలు విషయం బయటికి వచ్చేసింది. 2022లో జగన్ హయాంలోనే ఈ బ్రాండును ప్రవేశపెట్టారు. ఒక మీటింగ్‌లో స్వయంగా పవన్ కళ్యాణే ‘పవర్ స్టార్’ అంటూ తన పేరుతో కూడా ఒక బ్రాండు తెచ్చారని ఎద్దేవా చేశాడు. దాని గురించి మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన వాళ్లు ఎక్స్‌పోజ్ చేసి వైసీపీ పరువు తీశారు. అయినా సరే.. వైసీపీ హ్యాండిల్ నుంచి ఆ పోస్టు తొలగించకపోవడం గమనార్హం.

This post was last modified on July 2, 2024 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago